ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Paper Leak: సిట్ కస్టడీకి టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు నిందితులు

ABN, First Publish Date - 2023-03-18T19:18:40+05:30

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీక్‌ కేసు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ కస్టడీకి ఆఫీస్‌లో నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీక్‌ కేసు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ కస్టడీకి ఆఫీస్‌లో నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ (Scene reconstruction) పూర్తైంది. ఈ కేసులో A1 ప్రవీణ్, A2 రాజశేఖర్‌తో కలిసి నేరం చేసిన తీరుపై సిట్‌ అధికారులు ఆరా తీశారు. టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌ నుంచి 2 కంప్యూటర్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి కంప్యూటర్‌లో డేటా చోరీపై ఆరా తీశారు. నిందితులను హిమాయత్‌నగర్ సిట్ ఆఫీస్‌లో ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నపత్రం ఎవరెవరికి విక్రయించారనే దానిపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak) వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఆరా తీస్తోంది.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాశాడు. 103 మార్కులు కూడా వచ్చాయి. కానీ, ఓఎంఆర్‌ షీట్‌ డిస్‌క్వాలిఫై అయింది. కఠినమైన గ్రూప్‌-1పరీక్షలో 150కి 103 మార్కులు సాధించిన ప్రవీణ్‌.. బుక్‌లెట్‌ కోడ్‌ తప్పుగా బబ్లింగ్‌ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎ్‌సపీఎస్సీలో నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్‌ సెక్షన్‌లో పనిచేసిన ప్రవీణ్‌.. ఆ తర్వాత సెక్షన్‌ ఆఫీసర్‌గా ఎదిగాడు. అలాంటి వ్యక్తికి పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ రాసే విధానంపై అవగాహన లేదనుకోవడం పొరపాటని సిట్‌ అధికారులు భావిస్తునట్లు తెలుస్తోంది. 103 మార్కులు వచ్చేలా పరీక్ష రాసిన ప్రవీణ్‌.. కావాలనే డిస్‌క్వాలిఫై అయ్యేందుకు బబ్లింగ్‌లో తప్పు చేసినట్లు అనుమానిస్తున్నారు.

Updated Date - 2023-03-18T19:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising