Mobile cover: మొబైల్ కవర్‌లో డబ్బులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త.. ప్రాణాలు కూడా పోవచ్చు!
ABN, First Publish Date - 2023-08-20T10:47:21+05:30
మీరు మొబైల్ కవర్లలో డబ్బులు పెడుతుంటారా? 10, 20, 50, 100 లేదా 300 రూపాయల నోట్లను ఫోన్ వెనుక ఉంచుతారా? అయితే జాగ్రత్త.. ఆ అలవాటే మీ కొంప ముంచే ప్రమాదముంది. మనదేశంలో చాలా మంది అలాంటి తప్పు చేస్తుంటారు. అలా కరెన్సీ నోట్లను ఫోన్ వెనుక పెట్టడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందట.
మీరు మొబైల్ కవర్లలో (Mobile Covers) డబ్బులు పెడుతుంటారా? 10, 20, 50, 100 లేదా 300 రూపాయల నోట్లను ఫోన్ వెనుక ఉంచుతారా? అయితే జాగ్రత్త.. ఆ అలవాటే మీ కొంప ముంచే ప్రమాదముంది. మనదేశంలో చాలా మంది అలాంటి తప్పు చేస్తుంటారు. అలా కరెన్సీ నోట్ల (Currency Notes)ను ఫోన్ వెనుక పెట్టడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందట. అసలు అలా కరెన్సీ నోట్లను ఫోన్ వెనుక పెట్టడం వల్ల తలెత్తే అనర్థాలు ఏంటో తెలుసుకుందాం.
ఫోన్ ఎక్కువగా వాడుతున్నప్పుడు లేదా ఛార్జింగ్ (Mobile Charging) పెట్టినపుడు అది వేడెక్కడం గమనించే ఉంటారు. ముఖ్యంగా బ్యాటరీ ఉండే ఫోన్ వెనుక భాగంలో ఎక్కువగా వేడెక్కుతుంది (Mobile Heating). గాలి తగలడం వల్ల ఆ వేడి బయటకు వెళ్లి క్రమంగా చల్లబడుతుంది. అయితే ఫోన్‌కు వేసే కవర్‌లో డబ్బులు గనక పెడితే ఆ భాగంలో గాలి తగలక వేడి తగ్గదు. దీంతో ఫోన్ పేలిపోయే (Mobile Blast) ప్రమాదం ఉంది. నిజానికి నోట్లు పెట్టడమే కాదు.. ఫోన్‌కు బిగుతైన కవర్ వేయడం కూడా ప్రమాదమే.
Vande Bharat: వందే భారత్ రైళ్లలో రాత్రిళ్లు ప్రయాణిస్తున్నారా..? ఈ రూల్స్ ముందే తెలుసుకోండి..!
కరెన్సీ నోట్లను తయారు చేసేందుకు కాగితంతోపాటు అనేక రకాల రసాయనాలను కూడా వినియోగిస్తుంటారు. ఆ రసాయనాలు కూడా ఫోన్ వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఆ క్రమంలో మొబైల్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి మొబైల్ కవర్లలో నోట్లు పెట్టకపోవడం శ్రేయస్కరం. అలాగే మొబైల్ కవర్‌ను ఎంపిక చేసుకునేటపుడు కూడా మొబైల్‌కు గాలి తగిలే ఏర్పాటు ఉన్న కవర్‌ను ఎంపిక చేసుకోవాలి.
Updated Date - 2023-08-20T10:47:21+05:30 IST