ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WTC Final: రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న భారత్.. స్కోర్ ఎంతంటే...

ABN, First Publish Date - 2023-06-10T20:33:41+05:30

డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా డిక్లేర్డ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత జట్టు శుభారంభాన్ని అందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా డిక్లేర్డ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత జట్టు శుభారంభాన్ని అందించింది. భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతూ స్కోర్ పెంచుతున్నారు. రోహిత్ శర్మ 38, పూజారా 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత్ ముందు ఆస్ట్రేలియా 444 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 445 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోవాలంటే టీం ఇండియా బ్యాటర్లు భారీ స్థాయిలో పరుగులు చేయాల్సి ఉంటుంది.

7.1 ఓవర్లలో భారత్ 41 పరుగులు చేసి తొలి వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో 18 పరుగులు చేసిన శుభమాన్ గిల్ బోలాండ్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 270-8 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేయగా, తొలి ఇన్సింగ్స్‌లో టీం ఇండియా 296 పరుగులు చేసింది.

మిచెల్ స్టార్క్ 57 బంతుల్లో 41 పరుగులు చేసి షమి బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలెక్స్ కారీ 66, కమిన్స్ 5 పరుగులు చేశారు.

తొలి సెషన్‌ ప్రారంభంలోనే ఆసీస్‌కు షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో 5వ వికెట్ కోల్పోయింది. 46.4 ఓవర్ వద్ద భారత (India) బౌలర్ ఉమేశ్ వేసిన బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ ఔటయ్యాడు. దీంతో వికెట్లు పడనివ్వకుండా ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు నిలకడగా ఆడుతున్న క్రమంలో 62.6 ఓవర్ వద్ద ఆసీస్ 167 పరుగులు చేసి 6వ వికెట్ కోల్పోయింది. కామెరాన్ గ్రీన్ 95 బంతుల్లో 25 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Updated Date - 2023-06-10T20:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising