ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Australia 4th Test: నాల్గవ టెస్టులో భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా..క్రీజులో నిలదొక్కుకున్న బ్యాటర్లు

ABN, First Publish Date - 2023-03-10T11:09:36+05:30

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని(Border Gavaskar Trophy) చివరి టెస్టు మ్యాచ్‎లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Ahmedabad: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని(Border Gavaskar Trophy) చివరి టెస్టు మ్యాచ్‎లో ఆస్ట్రేలియా (Australia)జట్టు పట్టుబిగిస్తోంది. భారీ స్కోర్ దిశగా ఆసీస్ పయనిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 255/4తో రెండో రోజు బ్యాటింగ్‎కు దిగిన ఆసీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. భారత బౌలర్లకు(Indian bowlers) చుక్కలు చూపిస్తున్నారు. ఎటువంటి బంతులు వేసినా అలవోకగా బౌండరీలు బాదుతూ..చెమటలు పట్టిస్తున్నారు. మరో ఎండ్‎లో దూకుడుగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్(Cameron Green ‎) ‎హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ ఇద్దరు కలిసి జట్టు స్కోర్‎ను పరుగుల బాట పట్టిస్తున్నారు. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja) 325 బంతుల్లో 18 ఫోర్లతో 133 రన్స్ చేయగా.. కామెరూన్ గ్రీన్(Cameron Greene) కూడా సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. 114 బంతుల్లో 10 ఫోర్లతో 71 రన్స్ చేసి ఊపుమీద ఉన్నాడు. ఇప్పటికే క్రీజులో ఇద్దరు నిలదొక్కుకోవడంతో జట్టు భారీ స్కోర్ చేసే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 111 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లను కోల్పోయి 306 పరుగులు చేసింది. ఇప్పటికే ఈ సిరీస్ లో 2-1 ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని ఆస్ట్రేలియా జట్టు పట్టుదలతో ఆడుతుంది.

Updated Date - 2023-03-10T11:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising