ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sneh Rana: అమ్మాయితో అసభ్యకర చాటింగ్.. క్రికెటర్ స్నేహ్ రాణా కోచ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. విషం తాగిన కోచ్!

ABN, First Publish Date - 2023-03-28T19:44:23+05:30

టీమిండియా క్రికెటర్ స్నేహ్ రాణా (Sneh Rana) కోచ్ నరేంద్ర షా(Narendra Shah)పై పోక్సో చట్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డెహ్రాడూన్: టీమిండియా క్రికెటర్ స్నేహ్ రాణా (Sneh Rana) కోచ్ నరేంద్ర షా(Narendra Shah)పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (CAU) మాజీ ఆఫీస్ బేరర్ అయిన నరేంద్ర షా క్రికెట్‌లో శిక్షణ పొందుతున్న బాలికతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చి వైరల్ అయింది. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాలికతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చి కలకలం రేపడంతో షా తన ఇంట్లో విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే డెహ్రాడూన్‌లోని డూన్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్చారు. సీఏయూలోని మహిళా క్రికెట్ కో కన్వీనర్‌గా ఉన్న షాను ఇప్పటికే ఆ పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆయన చమోలి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు.

‘హిందూస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం చమోలి జిల్లాకు చెందిన బాధిత బాలిక పదో తరగతి చదువుకుంటూనే డెహ్రాడూన్‌లో క్రికెట్‌లో శిక్షణ పొందుతోంది. ఈ ఆడియో విషయంలో బాలిక కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ షాపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. షా ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం షా మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో పోలీసులు ఆయన నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్ తీసుకోలేదు.

Updated Date - 2023-03-28T19:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising