ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ravindra Jadeja: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ల నోళ్లు మూయించిన జడేజా!

ABN, First Publish Date - 2023-02-12T21:13:36+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా నాగ్‌పూర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా నాగ్‌పూర్‌(Nagpur Test)లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. భారత జట్టు చేతిలో ఆసీస్ (Australia) దారుణంగా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆ జట్టు మాజీ క్రికెటర్లు పిచ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా( Ravindra Jadeja) అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. పిచ్‌పై ఉన్న గుంతులను వారు భారత్‌కు వస్తూ విమానంలోంచి చూసి ఉంటారని ఎద్దేవా చేస్తూ వారి నోళ్లు మూయించాడు.

ఇది స్పిన్ పిచ్ అంటూ మ్యాచ్‌కు ముందు ప్రచారం చేసిన విషయాన్ని జడేజా ఈ సందర్భంగా గుర్తు చేశాడు. నిజానికి ఈ పిచ్‌పై స్పిన్ తక్కువగానే ఉందన్నాడు. కంగారూ బ్యాటర్లలో ఎక్కువమంది స్పిన్ లేకుండా నేరుగా విసిరిన బంతులకే అవుటయ్యారని అన్నాడు. బంతులను తాము సూటిగా విసరడం వల్లే వారిలో ఎక్కువ మంది వికెట్ల ముందు దొరికిపోయారని అన్నాడు.

అంతేకాదు, బౌలర్లకు అనుకూలించేలా పిచ్‌లను తయారుచేయడంలో తప్పేముందని జడేజా ప్రశ్నించాడు. భారత జట్టులో మంచి పేసర్లు ఉన్నారని అయితే, సొంతగడ్డపై జరిగిన మ్యాచుల్లో స్పిన్నర్లే జట్టును గెలిపించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. కాబట్టి తమ బలమైన స్పిన్నర్లతో ఎందుకు ఆడకూడదన్నాడు.

ఆస్ట్రేలియా కూడా ఎప్పుడూ తమకు అనువుగా ఉండే పిచ్‌లనే తయారుచేసుకుంటుందని జడేజా విమర్శించాడు. తాము గతంలో ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు పచ్చికతో కూడిన గ్రీన్ టాప్ పిచ్‌లను ఏర్పాటు చేసినా ఆ విషయమై తామెప్పుడూ ఫిర్యాదు చేయలేదన్నాడు. కాబట్టి ఇక్కడి పిచ్‌లపై వారు మాట్లాడకపోవడమే మంచిదన్నాడు.

గాయం కారణంగా చాలాకాలం పాటు జట్టుకు దూరమైన జడేజా ఈ సిరీస్‌తోనే తిరిగి జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే తన ఆల్‌రౌండర్ ప్రతిభతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో 70 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన జడేజా బౌలింగులో రెండు ఏడు వికెట్లు తీసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

Updated Date - 2023-02-12T21:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising