ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్లు.. 102 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

ABN, First Publish Date - 2023-10-02T16:57:05+05:30

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో మనం కొత్త రకం బ్యాట్లను చూడబోతున్నాం. కశ్మీర్‌లో తయారైన బ్యాట్లతో పలువురు ఆటగాళ్లు బరిలోకి దిగబోతున్నారు.

వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో మ్యాచ్‌లు జరగబోతున్నాయి. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో మనం కొత్త రకం బ్యాట్లను చూడబోతున్నాం. కశ్మీర్‌లో తయారైన బ్యాట్లతో పలువురు ఆటగాళ్లు బరిలోకి దిగబోతున్నారు. 102 ఏళ్లుగా కశ్మీర్ వ్యాలీలో కాశ్మీర్ విల్లో బ్యాట్లను తయారుచేస్తున్నారు. అయితే తొలిసారి 50 ఓవర్ల ప్రపంచకప్‌లో ఈ బ్యాట్లను వినియోగించనున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్లతో ఆటగాళ్లు భారీ సిక్సర్లను కొట్టారు. దీంతో ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది. వన్డే ప్రపంచకప్‌లోనూ ఈ బ్యాట్లు ఉపయోగించిన ఆటగాళ్లు భారీ షాట్లు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Baig sir: ప్రముఖ క్రికెట్ కోచ్, హైదరాబాద్ మాజీ క్రికెటర్ కన్నుమూత

క్రికెట్ ప్రపంచంలో సాధారణంగా ఇంగ్లీష్ విల్లో, కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగిస్తుంటారు. వీటిలో ఇంగ్లీష్ విల్లో బ్యాట్లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో కొత్త ఒరవడి మొదలైంది. కాశ్మీర్ విల్లో బ్యాట్‌లకు డిమాండ్ మరింత పెరగడానికి కారణం వాటి ధర. కాశ్మీర్ విల్లో బ్యాట్‌లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్‌లతో పోలిస్తే చౌకగా ఉంటాయి. అలాగే కాశ్మీర్ విల్లో బ్యాట్ల నాణ్యత కూడా బాగుంది. కాశ్మీర్ విల్లో బ్యాట్లు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు ఉంటాయి. కానీ ఇంగ్లీష్ విల్లో బ్యాట్ ధర రూ.లక్ష. అందువల్ల చాలా మంది ఆటగాళ్లు కాశ్మీర్ విల్లో బ్యాట్‌ల వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తు్న్నారు. ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక వంటి క్రికెట్ దేశాలు ఈ ప్రపంచ కప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్‌లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కాశ్మీర్ విల్లో బ్యాట్ల వినియోగం పెద్ద ఊతం ఇవ్వనుంది.

Updated Date - 2023-10-02T16:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising