ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rashmika Mandanna: ఐపీఎల్‌లో ఇష్టమైన ఆటగాడు.. ఫేవరెట్ టీం ఏదో చెప్పేసిన ‘నేషనల్ క్రష్’

ABN, First Publish Date - 2023-05-01T20:04:25+05:30

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మార్చి 31న ఐపీఎల్ (IPL 2023) ప్రారంభమైంది. ఆరంభ వేడుకల్లో ప్రముఖ నటి రష్మిక మందన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మార్చి 31న ఐపీఎల్ (IPL 2023) ప్రారంభమైంది. ఆరంభ వేడుకల్లో ప్రముఖ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) అద్దిరిపోయే ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘పుష్ప సినిమాలోని ‘సామి’ పాటతో తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలో పుష్పలోని ‘శ్రీవల్లి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు డ్యాన్స్ చేసి స్టేడియాన్ని హోరెత్తించింది. ఈ వేడుకల్లో సహనటి తమన్నా భాటియా, స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ కూడా ప్రదర్శనలిచ్చారు.

రష్మిక తాజాగా ‘స్టార్‌స్పోర్ట్స్’ (Star Sports)తో మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో తనకు ఇష్టమైన జట్టు ఏదో, ఇష్టమైన ఆటగాడు ఎవరో బయటపెట్టింది. తన ఫేవరెట్ జట్టు ఆర్సీబీ అని పేర్కొంది. తాను బెంగళూరు అమ్మాయినని, తమకు ‘ఈ సాలా కప్ నమదే’ (ఈ ఏడాది కప్పు మనదే) నినాదం ఉందని, కాబట్టి ఈసారి బెంగళూరు కప్పు కొట్టి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

మరి ఫేవరెట్ ఐపీఎల్ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు రష్మిక ఠక్కున బదులిస్తూ.. ‘విరాట్ సర్’ అని పేర్కొంది. అతడి దూకుడు, బ్యాటింగ్ శైలి అద్భుతమని ప్రశంసించింది. కాగా, రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’తోపాటు ‘రెయిన్‌బో’ సినిమాలో నటిస్తోంది. హిందీలో తెలుగు దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరో.

Updated Date - 2023-05-01T20:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising