ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: ఈసారి ఐపీఎల్ విజేత ఎవరో చెప్పేసిన కలిస్.. ఆ జట్టు తొలిసారి ఎగరేసుకుపోతుందట!

ABN, First Publish Date - 2023-03-30T21:25:26+05:30

ఐపీఎల్ 2023 విజేత ఎవరు? మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇదేం ప్రశ్న అని అనిపిస్తోందా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: ఐపీఎల్ 2023 విజేత ఎవరు? మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇదేం ప్రశ్న అని అనిపిస్తోందా? జట్ల బలాబలాలు, గత ఏడాది ప్రదర్శన వంటివి పరిగణనలోకి తీసుకుని సాధారణంగా మ్యాచ్ విన్నర్‌ను ఊహిస్తూ ఉంటారు. సౌతాఫ్రికా లెజండరీ ఆల్‌రౌండర్ జాక్విస్ కలిస్(Jacques Kallis) ఈ విషయంలో ముందే ఉన్నాడు. ‘స్టార్ స్పోర్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలిస్ మాట్లాడుతూ.. నిజానికి ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే జట్టేదో ఊహించడం కష్టమని పేర్కొన్నాడు. అయితే, ఈసారి ఫైనల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)-ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) మధ్య జరుగుతుందని, అంతిమంగా ఢిల్లీ కేపిటల్స్ కప్పును ఎగరేసుకుపోతుందని కలిస్ జోస్యం చెప్పాడు.

ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటి వరకు ట్రోఫీ సాధించలేదు. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీ కేపిటల్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020లలో టైటిళ్లు సాధించింది. ఇక, గత సీజన్‌లో ఢిల్లీ ఏడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. త్రుటిలో ప్లే ఆఫ్ అవకాశాన్ని జారవిడుచుకుంది. ముంబై ఇండియన్స్ ఆ సీజన్‌లో 14 మ్యాచులకు గాను నాలుగింటిలో మాత్రమే గెలిచి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది.

జాక్విస్ కలిస్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 2008 నుంచి 2010 వరకు ఆడాడు. ఆ తర్వాత మూడేళ్లపాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కేకేఆర్ జట్టులో కలిస్ సభ్యుడు కూడా.

మొత్తం 98 మ్యాచుల్లో కలిస్ 28.55 సగటుతో 2,427 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 109.23. అతడి ఖాతాలో 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 89 పరుగులు కాగా, 65 వికెట్లు తీసుకున్నాడు. 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగులో ఇదే అత్యుత్తమం.

Updated Date - 2023-03-30T22:08:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising