ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Team India: టీమిండియా ఇక నంబర్ వన్!

ABN, First Publish Date - 2023-01-24T21:39:30+05:30

న్యూజిలాండ్‌(New Zealand)తో ఇక్కడ హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో విజయం సాధించిన భారత్(Team India) నంబర్ వన్ జట్టుగా అవతరించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: న్యూజిలాండ్‌(New Zealand)తో ఇక్కడ హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో విజయం సాధించిన భారత్(Team India) నంబర్ వన్ జట్టుగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 90 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఈ గెలుపుతో వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టేసి టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్(England), న్యూజిలాండ్, ఇండియా తలా 113 రేటింగ్ పాయింట్స్‌తో వరుసగా ఒకటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు కివీస్‌పై భారత్ విజయం సాధించడంతో ఇంగ్లండ్ రెండో స్థానానికి పడిపోగా, న్యూజిలాండ్ నాలుగో స్థానానికి దిగజారింది. ఇండియా రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానికి చేరుకుంది.

ఇప్పుడు ఇండియా 114 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ 113 స్థానాలతో రెండు స్థానంలోను, 112 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. తాజా ఓటమితో రెండు పాయింట్లు కోల్పోయిన కివీస్ 111 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ కనుక విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

Updated Date - 2023-01-24T21:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising