ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: విరాట్ కోహ్లీ మహిమ.. హాట్‌స్టార్ ప్రపంచరికార్డు

ABN, First Publish Date - 2023-11-16T15:26:45+05:30

Hot Star Record: తొలి సెమీఫైనల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ క్రీడల చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 50వ సెంచరీ చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టడంతో ఆ సమయంలో హాట్ స్టార్‌ రియల్ టైమ్ వ్యూస్ 5 కోట్లు దాటింది. దీంతో ఇప్పటివరకు 4.4 కోట్లు వ్యూస్‌గా ఉన్న రికార్డు కనుమరుగైంది.

వన్డే ప్రపంచకప్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయడం హాట్‌స్టార్‌కు భలే కలిసి వస్తోందని చెప్పాలి. అయితే దీనికి పునాది వేసింది మాత్రం జియో సినిమానే. ఐపీఎల్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేసి రికార్డులు సృష్టించడంతో జియో బాటలోనే హాట్ స్టార్ కూడా పయనిస్తోంది. దీంతో ఆసియా కప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌ను కూడా హాట్ స్టార్ మొబైల్ వినియోగదారులకు ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించింది. ఆసియా కప్‌కు అంత ఆదరణ దక్కకపోయినా.. వన్డే ప్రపంచకప్‌కు మాత్రం హాట్‌స్టార్‌కు విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ 10 దేశాల మధ్య జరగడం.. మ్యాచ్‌లు రసవత్తరంగా సాగడం.. టీమిండియా వీరవిహారం చేస్తుండటంతో క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హాట్‌స్టార్‌కు వ్యూయర్ షిప్ భారీస్థాయిలో పెరుగుతోంది. తొలి సెమీఫైనల్లో అయితే హాట్ స్టార్ క్రీడల చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 50వ సెంచరీ చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టడంతో ఆ సమయంలో హాట్ స్టార్‌ రియల్ టైమ్ వ్యూస్ 5 కోట్లు దాటింది. దీంతో ఇప్పటివరకు 4.4 కోట్లు వ్యూస్‌గా ఉన్న రికార్డు కనుమరుగైంది.

ఈ రికార్డు కూడా ఈ వన్డే ప్రపంచకప్‌లోనే హాట్ స్టార్ నమోదు చేయడం గమనించాల్సిన విషయం. దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడిన లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ 49వ సెంచరీ సమయంలోనే 4.4 కోట్ల వ్యూస్ రికార్డు నమోదైంది. ఇదే ఇప్పటి వరకు క్రీడల చరిత్రలో ప్రపంచ రికార్డు అని హాట్ స్టార్ స్వయంగా ప్రకటించింది. కానీ తొలి సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ రికార్డుస్థాయిలో శతకం నమోదు చేయడం 5 కోట్ల రియల్ టైమ్ వ్యూస్ నమోదయ్యాయి. కోహ్లీ సెంచరీ సందర్భంగా సచిన్ అభినందించడం, అనుష్క శర్మ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం అభిమానులను అలరించాయి. టీమిండియా ఫైనల్ చేరడంతో ఒకవేళ విశ్వవిజేతగా నిలిస్తే.. ఆ సమయంలో హాట్ స్టార్ తాజా రికార్డును బద్దలు కొడుతుందని క్రికెట్ అభిమానులు విశ్వసిస్తున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ శతకాల కారణంగానే హాట్ స్టార్ ప్రపంచ రికార్డులను నమోదు చేస్తోందని.. దీనికి జియో సినిమానే పరోక్ష కారణమని కూడా సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-16T15:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising