ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Harbhajan Singh: వార్నర్.. నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో!

ABN, First Publish Date - 2023-04-30T16:53:08+05:30

ఈ సీజన్‌లో దారుణంగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందీ అంటే.. అది ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) ఒక్కటే. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో దారుణంగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందీ అంటే.. అది ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) ఒక్కటే. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ (David Warner) సేన రెండింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు అడుగంటాయి. ఢిల్లీ కేపిటల్స్ ఇంత దారుణంగా చతికలపడడానికి చాలా కారణాలే ఉన్నాయి. వార్నర్ కెప్టెన్సీతోపాటు అతడి బ్యాటింగ్ తీరు అందులో మొదటిది. ఈ రెండూ చాలా దారుణంగా ఉన్నాయని ఇప్పటికే పలువురు టీమిండియా మాజీలు విమర్శలు గుప్పించారు. తాజాగా, ఈ జాబితాలో హర్భజన్ సింగ్ (Harbhajan Singh) వచ్చి చేరాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ పేలవ ప్రదర్శనకు వార్నరే కారణమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH)తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ 9తో ఓటమి పాలైంది. వార్నర్ కనుక 50 బంతులు ఆడి ఉంటే ఢిల్లీ జట్టు 50 పరుగులు తేడాతో ఓటమి పాలయ్యేదని, ఆ బంతులన్నీ వృథా అయి ఉండేవని హర్భజన్ అన్నాడు. డీసీ మళ్లీ పుంజుకుని నిలదొక్కుకోవడం కష్టమేనని హర్భజన్ తేల్చేశాడు.

‘‘వారు మళ్లీ పుంజుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. దీనికి మొత్తం కారకుడు కెప్టెన్ వార్నరే. అతడు తన జట్టును సరిగా నడిపించలేకపోతున్నాడు. దీనికి తోడు అతడి ఫామ్ కూడా సమస్యగా మారింది. ఇది తీవ్ర నిరాశపరిచింది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో వార్నర్ తొందరగా అవుటయ్యాడు కాబట్టే ఆ జట్టు కనీసం పోరాడ గలిగింది. అదే వార్నర్ కనుక 50 బంతులు ఆడి ఉంటే అప్పుడు ఢిల్లీ 50 పరుగుల తేడాతో ఓడిపోయి ఉండేది’’ అని చెప్పుకొచ్చాడు.

నిజానికి ఈ సీజన్‌లో వార్నర్ బ్యాటింగ్‌ను శంకించాల్సిన పనిలేదు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అతడు కూడా ఉన్నాడు. 8 మ్యాచుల్లో 306 పరుగులు చేశాడు. సగటు 38.5. అయితే, వచ్చిన చిక్కల్లా అతడి స్ట్రైక్ రేటే. అది 118.60గా ఉంది.

పరాజయాలకు వార్నర్ సహచరుల తప్పులను ఎత్తి చూపుతున్నాడన్న హర్భజన్.. మరి ఇప్పటి వరకు అతడేం చేశాడని ప్రశ్నించాడు. అసలు అతడికే తపన లేదని విమర్శించాడు. 300కు పైగా పరుగులు చేయడం గొప్ప విషయం కాదని, ఒకసారి స్ట్రైక్ రేట్ కూడా చూసుకోవాలని అన్నాడు. నిజానికి అతడి సామర్థ్యానికి న్యాయం చేయడం లేదన్నాడు. అతడు చేసిన 300 పరుగుల వల్ల ఉపయోగం లేకుండా పోయిందన్నాడు. జట్టు అట్టడుగున ఎందుకు ఉందో తెలుసుకోవాలంటే వార్నర్ ఒకసారి అద్దంలో చూసుకోవాలని హర్భజన్ సింగ్ సూచించాడు.

అంతేకాదు, వార్నర్‌ను పక్కనపెట్టి ఢిల్లీ పగ్గాలు అక్షర్ పటేల్‌కు అందించాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా, ఢిల్లీ ప్లే ఆఫ్స్‌లో నిలబడాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లోనూ తప్పక గెలవని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-04-30T16:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising