ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటరిగా బైక్‌పై వెళ్లే కుర్రాళ్లూ జర జాగ్రత్త.. అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడో యువకుడు.. అంతే..

ABN, First Publish Date - 2023-02-02T18:57:20+05:30

ఒంటరిగా మహిళలు కనపడితే చాలు.. దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఇంకొందరు అమ్మాయిలను బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని అఘాయిత్యాలకు పాల్పడడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటరిగా మహిళలు కనపడితే చాలు.. దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఇంకొందరు అమ్మాయిలను బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని అఘాయిత్యాలకు పాల్పడడం కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఈ ఘటనతో అమ్మాయిలు ఒంటరిగా ఉండడంతో పాటూ లిఫ్ట్ అడిగినా ఎక్కించుకోవడానికి యువకులు జంకుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) దన్‌కౌర్ పట్టణానికి చెందిన సునిల్ కుమార్ అనే యువకుడు.. గ్రేటర్ నోయిడాలోని (Greater Noida) ఓ కంపెనీలో పని చేస్తుంటాడు. బుధవారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. బాగ్‌పూర్ సమీపానికి రాగానే ఓ యువతి (young woman) బైకు ఆపి లిఫ్ట్ అడిగింది. అమ్మాయి కావడంతో వెంటనే తన బండి ఎక్కించుకున్నాడు. మార్గ మధ్యలో యువకుడి జేబులోని మొబైల్ (Mobile theft) చాకచక్యంగా తీసుకుంది. కొద్ది సేపటికి గమనించిన యువకుడు.. ఫోన్ లేకపోవడంతో చూసుకుని ఖంగుతిన్నాడు. బండి సదరు యువతిని మొబైల్ గురించి అడిగాడు.

ఎంగేజ్మెంట్ రోజే ఓ యువకుడికి ఊహించని షాక్.. సడన్‌గా ఇంటి ముందు ప్రేయసి ఎంట్రీ.. చివరకు..!

దీంతో ఒక్కసారిగా ఆమె సునిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నీకు నేను ఎలా కనపడుతున్నాను’’.. అంటూ దుర్భాషలాడింది. వీరి గొడవను గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో యువతి అక్కడి నుంచి పరారైంది. తర్వాత బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కి చేరుకుని ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితమే రూ.32వేలు ఖర్చు ఫోన్ కొన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల రోజులుగా గ్రేటర్ నోయిడా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని స్థానికులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.

నా భర్త చాలా మంచోడు.. బ్రతకాలని లేక నేనే చచ్చిపోతున్నా.. అంటూ ఇంట్లో గోడపై రాతలు.. పోలీసులకు మరింత డౌట్.. చివరకు..!

Updated Date - 2023-02-02T18:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising