ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Flipkart: షాపింగ్ మాత్రమే కాదండోయ్.. ఫ్లిప్‌కార్ట్‌తో నయా బిజినెస్.. నెలకు రూ.75 వేలు ఈజీగా సంపాదించొచ్చు..!

ABN, First Publish Date - 2023-07-07T19:14:22+05:30

ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ షాపింగ్‌దే రాజ్యం. మొబైల్‌లో చూసి కావాల్సిన వస్తువును ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే రప్పించుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లకు గిరాకీ బాగా పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ షాపింగ్‌ (Online Shopping)దే రాజ్యం. మొబైల్‌లో చూసి కావాల్సిన వస్తువును ఆర్డర్ చేసి నేరుగా ఇంటికే రప్పించుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమేజాన్ (Amazon) వంటి ఈ-కామర్స్ సైట్లకు గిరాకీ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా మూరుమూల ప్రాంతాల్లోని వినియోగదారులకు కూడా సేవలు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఫ్రాంఛైజీలను (Flipkart delivery franchise) ఏర్పాటు చేయాలనుకుంటోంది.

దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వినియోదారులను చేరేందుకు అదనపు ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేయాలని ఫ్లిప్‌కార్ట్ అనుకుంటోంది. అందుకోసం స్థానిక వ్యక్తులకు ఫ్రాంఛైజీలను ఇవ్వబోతోంది. మీ ప్రాంతంలోని క్లయింట్‌లకు ఆర్డర్‌లను బట్వాడా చేయడానికి మీరు ఫ్లిప్‌కార్ట్ ఫ్రాంఛైజీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్ డెలివరీ భాగస్వామి కావడానికి మీరు కొన్నింటిని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా మీకు స్వంత కారు (Car) ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే మీకు తప్పనిసరిగా 500 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఇక, ఎట్టి పరిస్థితుల్లోనూ పేర్కొన్న తేదీలకు ఆర్డర్లను డెలివరీ చేయగలమనే హామీ ఇవ్వాలి.

Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. చేసేది తాపీ పనే కానీ.. పెద్ద పెద్ద ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోరుగా..!

ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఫ్రాంచైజీ కోసం మీరు చెల్లించాల్సిన ధర ప్రాంతం, ఆర్డర్‌ల పరిమాణం ఆధారంగా ఉంటుంది. ఫ్రాంఛైజీ కోసం రూ. 1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీరు చేసే ప్రతి డెలివరీకి కమీషన్ అందుతుంది. మీరు చేసే డెలివరీలు, దూరాన్ని బట్టి మీరు ఏడాదికి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు సంపాదన పొందవచ్చు.

Updated Date - 2023-07-07T19:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising