Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. చేసేది తాపీ పనే కానీ.. పెద్ద పెద్ద ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోరుగా..!
ABN , First Publish Date - 2023-07-07T16:45:37+05:30 IST
మెదడు ఉపయోగించి పని చేస్తే శ్రమ తగ్గుతుంది అని చాలా మంది చెబుతుంటారు. శారీరక శ్రమను తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్లాన్లు వేస్తారు. ముఖ్యంగా కూలీ పనులు చేసే కొందరు ఇంజనీర్లకు ధీటుగా ఆలోచించగలరు. అద్భుతమైన తెలివితో చాలా సులభంగా కఠినమైన పనులను చేస్తుంటారు.
మెదడు (Brain) ఉపయోగించి పని చేస్తే శ్రమ తగ్గుతుంది అని చాలా మంది చెబుతుంటారు. శారీరక శ్రమను తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్లాన్లు వేస్తారు. ముఖ్యంగా కూలీ పనులు చేసే కొందరు (Labourers) ఇంజనీర్లకు ధీటుగా ఆలోచించగలరు. అద్భుతమైన తెలివితో చాలా సులభంగా కఠినమైన పనులను చేస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యాయి. తాజాగా మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
@TansuYegen అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు కార్మికులు ఇంటి గోడ నిర్మిస్తున్నారు. ఒక తాపీ మేస్త్రీ ఇటుకలతో గోడను నిర్మిస్తుంటే మిగతా వారు అతనికి కావాల్సిన ఇసుక, సిమెంట్ మిశ్రమం, ఇటుకలు అందిస్తున్నారు. అయితే అలా అందించేందుకు వారు చాలా సులభమైన పద్ధతిని కనుగొన్నారు. రెండు చెక్క ఊయలలను ఏర్పాటు చేసుకుని పైకీ, కిందకూ ఊగుతూ సులభంగా, శ్రమ లేకుండా పని చేస్తున్నారు (Smart Work). ఆ వీడియో సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటోంది.
Vijay Shekhar Sharma: నెలకు 10 వేల జీతంతో కెరీర్ స్టార్ట్.. ఇప్పుడు రూ.8,222 కోట్ల ఆస్తి.. ఈయనెవరో తెలీకపోయినా.. ఫోన్లలో మాత్రం..!
ఈ వీడియోను (Jugaad Videos) ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``హార్డ్ వర్క్‌ను స్మార్ట్‌గా చేస్తున్నారు``, ``మంచి ఐడియా``, ``ఆలోచన బాగుంది`` అని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరిని ఆ ఐడియా అంతగా ఆకట్టుకోలేదు. ``ఇద్దరు చేయాల్సిన పనిని నలుగురు చేస్తున్నారు``, ``అంతకంటే మంచి ఐడియాలు చాలా ఉన్నాయి`` అంటూ కామెంట్లు చేశారు.