Vijay Shekhar Sharma: నెలకు 10 వేల జీతంతో కెరీర్ స్టార్ట్.. ఇప్పుడు రూ.8,222 కోట్ల ఆస్తి.. ఈయనెవరో తెలీకపోయినా.. ఫోన్లలో మాత్రం..!
ABN , First Publish Date - 2023-07-07T15:15:39+05:30 IST
ఆ కుర్రాడి పేరు విజయ్ శేఖర్ శర్మ.. అతడి తండ్రి ఓ స్కూల్ టీచర్.. సాధారణ మధ్యతరగతి కుటుంబం.. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనేది ఆ కుర్రాడి కల.. అనుకున్నట్టుగానే బాగా చదువుకుని ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు.. అక్కడ విజయ్‌ను కంప్యూటర్ బాగా ఆకర్షించింది..
ఆ కుర్రాడి పేరు విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma).. అతడి తండ్రి ఓ స్కూల్ టీచర్.. సాధారణ మధ్యతరగతి కుటుంబం.. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనేది ఆ కుర్రాడి కల.. అనుకున్నట్టుగానే బాగా చదువుకుని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు.. అక్కడ విజయ్‌ను కంప్యూటర్ బాగా ఆకర్షించింది.. వీలైనంత ఎక్కవ సమయం కంప్యూటర్ ల్యాబ్‌లోనే గడపేవాడు.. కంప్యూటర్, ఇంటర్నెట్, రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీ ఆ కుర్రాడిని బాగా ఆకర్షించాయి.. దీంతో అతడు వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు.. ఎన్నో కష్టనష్టాలు అనుభవించి ఊహించని స్థాయికి చేరుకున్నాడు.. ప్రస్తుతం అతడి ఆస్తి రూ.8,222 కోట్లు. అతడు స్థాపించిన కంపెనీ విలువ రూ.55 వేల కోట్లు. ఆ కంపెనీ పేరు ``పేటీఎమ్`` (Paytm).
అసాధారణ విజయాలు అందుకున్న అందరిలాగానే విజయ్ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్నో అపజయాలు చవిచూశారు. కానీ ఎక్కడా నిరుత్సాహపడలేదు. టెక్నాలజీపై ఉండే ప్యాషనే విజయ్‌ను ముందుకు నడిపించింది. చదువు పూర్తి కాగానే విజయ్ తన క్లాస్‌మేట్‌తో కలిసి ``Xs! కార్పొరేషన్`` అనే ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభివంచారు. వెబ్ సర్వీసులను అందించే ఈ పోర్టల్‌ను కొద్ది కాలానికి ఇతరులకు అమ్మేశారు. ఆ తర్వాత ``One97 కమ్యూనికేషన్స్``ను స్థాపించారు. మొదట్లో ఇది క్రికెట్ రేటింగ్, ఇతర సమాచారాన్ని అందించేది. అయితే, ఈ వెబ్‌సైట్ విజయ్‌కు తీవ్ర నష్టాలను మిగిల్చింది (Vijay Shekhar Sharma Success story).
Viral Video: ప్రయాణీకుల్లాగే నటించి సడన్‌గా షాకిచ్చిన ఇద్దరు యువతులు.. మెట్రో రైల్లో మరో షాకింగ్ సీన్..!
అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బులన్నీ ఖర్చయ్యాయి. దీంతో అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు సంపాదించిన మొత్తం కోల్పోయారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. రూ.10 వేల జీతానికి పని చేశారు. అయినా విజయ్ మనసు మాత్రం టెక్నాలజీ వైపే ఉంది. భవిష్యత్తు అంతా టెక్నాలజీదే అని ఊహించిన విజయ్ 2011లో పేటీఎమ్ సంస్థను ప్రారంభించారు. వినియోగదారులకు, వ్యాపారులకు పేమెంట్ గేట్‌వే సిస్టంగా దీనిని తీసుకొచ్చారు. ఈ యాప్ చాలా తక్కువ కాలంలోనే గ్రాండ్ సక్సెస్ అయింది. ఏడాది కాలంలోనే లక్షల సంఖ్యలో పేటీఎమ్ వ్యాలెట్లు క్రియేట్ అయ్యాయి (Vijay Shekhar Sharma Inspirational Story).
Shocking: మూడో అంతస్థులో ఉన్న ఫ్యామిలీకి సడన్‌గా వినిపించిందో పెద్ద శబ్దం.. ఏంటా అని బయటకు వచ్చి చూస్తే షాకింగ్ సీన్..!
2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత ఈ యాప్‌కి మరింత గిరాకీ పెరిగింది. పేటీఎంను ప్రస్తుతం 30 కోట్ల మందికి పైగా భారతీయులు ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ``ఫోన్ పే``, ``గూగుల్ పే`` వంటి ఇతర యూపీఐ ఆధారిత యాప్‌లతో పోటీ పడుతూ పేటీఎమ్ కూడా దూసుకుపోతోంది. ప్రస్తుతం విజయ్ శేఖర్ శర్మ నికర సంపద రూ.8,222 కోట్లు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన విజయ్ శేఖర్ శర్మ ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.