Viral News: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్.. ధర ఎంత ఉంటుందో ఊహించగలరా..? వందలు.. వేలు.. కాదండోయ్.. లక్షల్లో వెల..!
ABN, First Publish Date - 2023-06-03T13:57:29+05:30
ఒక నీళ్ల బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే ఓ ఇరవై రూపాయలు.
Viral News: ఒక నీళ్ల బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే ఓ ఇరవై రూపాయలు. ఇంక కొంచెం ఖరీదు అనుకుంటే రూ. 100 ఉంటుంది. అలాగే కొన్ని ఖరీదైన వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయనుకోండి. వాటి ధరలు వేలల్లో ఉంటాయి. కానీ, లక్షల్లో ఖరీదు చేసే వాటర్ బాటిల్ కూడా ఉంది. అంతేకాదండోయ్.. ఆ వాటర్ బాటిల్ ఖరీదుతో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆ వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ. 50 లక్షలు. అవును మీరు విన్నది నిజమే. ఆ వాటర్ బాటిల్ మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. అంతేనా.. తన ప్రత్యేకతో ఆ బాటిల్ ఏకంగా 2010లో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు కూడా సంపాదించింది. ఇప్పటికీ ఈ వాటర్ బాటిల్‌ను వెనక్కి తోసే, దీనికంటే ఖరీదైన నీళ్ల బాటిల్ తయారవ్వలేదట. దాంతో ఇది మళ్ళీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇది వార్తల్లో నిలిచింది. దాని పేరు ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటో ఎ మొడిగ్లైని’ (Acqua di Cristallo Tributo a Modigliani).
ఇక ఈ నీళ్ల బాటిల్ కేవలం 750 మిల్లీ లీటర్ల నీటిని మాత్రమే కలిగి ఉంటుంది. మరీ ఎందుకంత ఖరీదు అంటారా? అక్కడికే వస్తున్నాం. ఈ వాటర్ బాటిల్ ప్యాకేజింగ్, డిజైన్‌కే ధర మొత్తం. ఎందుకంటే ఈ బాటిల్ 24 క్యారెట్ బంగారంతో తయారు చేస్తారు. ఇక లోపల ఉన్న నీటిలో సైతం 5గ్రాముల బంగారం ద్రవ రూపంలో కలిసి ఉంటుంది. అది కూడా 24 క్యారెట్ల పసిడి. ఇక బాటిల్‌లో నింపే ఆ నీరు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అది ఎక్కడపడితే అక్కడ నుంచి తీసుకొచ్చింది కాదు మరి. ఐస్‌ల్యాండ్, ఫిజీ, ఫ్రాన్స్‌లోని హిమానీనదాలలో లభించే స్వచ్ఛమైన నీరు. అది కూడా బొట్టు బొట్టుగా వాటిని కష్టపడి సేకరిస్తారు. ప్రపంచంలోనే దీనికంటే స్వచ్ఛమైన నీరు లేదు. ఈ నీరు ఎంతో రుచికరమైనదని కూడా చెబుతున్నారు తాగిన వారు.
Mango Kernel: ఎందుకూ పనికిరావని మామిడి కాయలను తినేశాక టెంకలను పారేస్తున్నారా..? ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిస్తే..!
బాటిల్ తయారీ, ఆకారం కూడా ఎంతో స్పెషల్..
ఈ బాటిల్ తయారీ, ఆకారం కూడా ఎంతో స్పెషల్ అని చెప్పాలి. దాని ఆకారం అచ్చం మానవ ముఖాన్ని పోలి ఉంటుంది. అంతేకాదు ప్రముఖ ఆర్టిస్ట్ ఫెర్నాండో అల్టమిరానో (Fernando Altamirano) దీన్ని స్వయంగా తయారు చేయడం జరుగుతుంది. అది కూడా చేతితో దీన్ని తయారు చేస్తారు. ఇప్పటివరకు వీటిని చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే తయారు చేశారు. బిలియనీర్లు మాత్రమే వీటిని కొంటుంటారు. అలా వారి నుంచి ఆర్డర్ తీసుకున్నాకే వీటిని తయారు చేస్తారన్నమాట. అప్పుడప్పుడూ వీటి వేలం కూడా జరుగుతుంటుంది. ఆ వేలం ద్వారా వచ్చిన నగదును 'గ్లోబల్ వార్మింగ్' (Global Warming) నుంచి భూమిని రక్షించేందుకు చేపట్టే కార్యక్రమాల కోసం వెచ్చిస్తుంటారు.
Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..
Updated Date - 2023-06-03T13:57:29+05:30 IST