Viral Video: చావు అంచుల వరకు వెళ్లడమంటే ఇదే.. ఆమె త్రుటిలో తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో చూడండి..
ABN, First Publish Date - 2023-07-07T19:43:34+05:30
ఆ మహిళ చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది.. త్రుటిలో ప్రాణాలు కాపాడుకుంది.. ఒళ్లు గగుర్పొడిచే ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.
ఆ మహిళ చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది.. త్రుటిలో ప్రాణాలు కాపాడుకుంది.. ఒళ్లు గగుర్పొడిచే ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. హవాయి ( Hawaii) ద్వీపంలో మెరైన్ సైంటిస్ట్ రామ్సే స్కూబా డైవింగ్ చేయబోతుండగా ఈ ఘటన జరిగింది. 16 అడుగుల పొడవు ఉండే టైగర్ షార్క్ (Tiger Shark) నుంచి ఆమె త్రుటిలో తప్పించుకుంది.
Henry Marin అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రామ్సే అనే మెరైన్ సైంటిస్ట్ స్కూబా డైవింగ్ (Scuba Diving) చేసేందుకు సముద్రం (Ocean) మధ్యలోకి వెళ్లింది. బోటు నుంచి సముద్రంలోకి దూకేందుకు సిద్ధమవుతోంది. అయితే అప్పటికే ఆ బోటును టైగర్ షార్క్ ఫాలో అవుతోంది. రామ్సే సముద్రంలోకి మరొక్క సెకెనులో దూకుతోందనగా నీటి అడుగున షార్క్ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన రామ్సే వేగంగా బోటు పైకి ఎక్కేసింది.
Flipkart: షాపింగ్ మాత్రమే కాదండోయ్.. ఫ్లిప్‌కార్ట్‌తో నయా బిజినెస్.. నెలకు రూ.75 వేలు ఈజీగా సంపాదించొచ్చు..!
షార్క్ నోరు తెరుచుకుని రామ్సేను పట్టుకోవడానికి ప్రయత్నించింది. త్రుటిలో రామ్సే తప్పించుకుంది. ఈ ఘటన మొత్తం కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను 1.14 లక్షల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ``ఓ మైగాడ్``, ``అలాంటి ఓ ఘటనతో కెరీర్ మార్చుకోవాలనిపిస్తుంది``, ``నేనైతే భయంతో ఆ షార్క్ నోట్లోనే పడిపోతా`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-07-07T19:48:24+05:30 IST