Viral News: చెత్త ఏరుకుంటున్న ఈ అమ్మాయిని నా ఫొటోలోంచి తీసేయండంటూ ఓ యువతి ట్వీట్.. అడిగినట్టే చేసి షాకిచ్చిన నెటిజన్లు..!
ABN, First Publish Date - 2023-06-10T15:43:52+05:30
బ్రిటన్‌కు చెందిన జేమ్స్ ఫ్రిడ్‌మాన్ తన అద్భుతమైన ఫోటోషాప్ ప్రతిభతో గొప్ప గ్రాఫిక్ డిజైనర్‌గా ప్రసిద్ధి చెందాడు. అలాగే ఫొటోలను సహజంగా ఎడిటింగ్ చేసే నైపుణ్యం కూడా అతడి సొంతం. అతడికి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది.
బ్రిటన్ (Britain)కు చెందిన జేమ్స్ ఫ్రిడ్‌మాన్ (James Fridman) తన అద్భుతమైన ఫోటోషాప్ ప్రతిభతో గొప్ప గ్రాఫిక్ డిజైనర్‌గా ప్రసిద్ధి చెందాడు. అలాగే ఫొటోలను సహజంగా ఎడిటింగ్ చేసే నైపుణ్యం కూడా అతడి సొంతం. అతడికి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది వ్యక్తులు జేమ్స్‌ను సంప్రదించి తమ ఫొటోలను ఎడిట్ చేయమని అడుగుతుంటారు. అప్పుడప్పుడు జేమ్స్ వారు కోరిన విధంగా ఎడిట్ (Photo Editing) చేస్తుంటాడు.
ఇటీవల అతడికి ఓ మహిళ నుంచి విచిత్రమైన అభ్యర్థన వచ్చింది. ఆ విషయాన్ని జేమ్స్ సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకున్నాడు. ఓ మహిళ ఇటీవల తను తీయించుకున్న ఫొటోను జేమ్స్‌కు పంపించింది. ఆ ఫొటోలో ఆమెతో పాటు రోడ్డు మీద చెత్త ఏరుతున్న మహిళ (Trash Lady) కూడా పడింది. దీంతో ఆ ఫొటోను జేమ్స్‌కు పంపించి.. ఆ ఫొటో నుంచి ఆ చెత్తు ఏరుకుంటున్న మహిళను తొలగించాలని రిక్వెస్ట్ చేసింది. ``హాయ్ జేమ్స్.. ఈ ఫొటో నాకు బాగా నచ్చింది. అయితే ఫొటోలో ఉన్న ట్రాష్ లేడీని ఎడిట్ చేయగలవా? ఎందుకంటే నాకు ఆరెంజ్ కలర్ నచ్చదు`` అని రిక్వెస్ట్ చేసింది.
Viral Video: రోడ్డు పక్కన కూర్చున్న వీళ్లిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. వాళ్ల పనిలో వాళ్లుండగా పక్కన ఏదో పడినట్టు అనిపించి చూస్తే..!
ఆ మహిళ రిక్వెస్ట్‌కు స్పందించిన జేమ్స్.. ఆమె కోరినట్టే ఆ ట్రాష్ లేడీని ఫొటో నంచి తీసేశాడు. అయితే ఫొటోలో మరిన్ని చెత్త సంచీలను యాడ్ చేశాడు. ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఆ ట్వీట్‌ను ఇప్పటివరకు 1.40 కోట్ల మంది వీక్షించారు. 2.62 లక్షల లైక్‌లు వచ్చాయి. జేమ్స్ మాత్రమే కాదు.. మరికొందరు నెటిజన్లు కూడా ఆ ఫొటోను తమదైన శైలిలో ఎడిట్ చేస్తున్నారు. ``ట్రాష్ లేడీ లేకపోతే ఉండేది చెత్తే``, ``హా..హా.. అద్భుతమైన ఎడిటింగ్``, ``జేమ్స్ నిజమైన లెజెండ్`` అంటూ ట్వీట్లు చేశారు.
Updated Date - 2023-06-10T15:43:52+05:30 IST