Viral Video: రోడ్డు పక్కన కూర్చున్న వీళ్లిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. వాళ్ల పనిలో వాళ్లుండగా పక్కన ఏదో పడినట్టు అనిపించి చూస్తే..!
ABN , First Publish Date - 2023-06-09T21:29:55+05:30 IST
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఢిల్లీ పోలీసులు నిత్యం రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఆయా వీడియోల ద్వారా జనాల్లో పలు విషయాలపై అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో...
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఢిల్లీ పోలీసులు (Delhi Police) నిత్యం రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఆయా వీడియోల ద్వారా జనాల్లో పలు విషయాలపై అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో (Funny Videos) ఫన్నీగా ఉండడమే కాకుండా, రోడ్డుపై స్టంట్లు (Bicycle Stunt) చేసే వారికి వార్నింగ్ కూడా ఇస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్‌పై వెళుతున్నాడు. అయితే అతడి పాదాలు పెడల్స్‌పై కాకుండా ముందు ఉన్న హ్యాండిల్‌పై ఉన్నాయి. కాళ్లు తిన్నగా హ్యాండిల్ వరకు జాపి స్టంట్ చేసేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే స్టంట్ ఫెయిల్ అయి సైకిల్ తిరగబడింది. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోయింది. అతడి వెనుక భాగంలో గట్టి దెబ్బ తగిలింది. ఆ తర్వాత అతడు నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అక్కడ రోడ్డు పక్కన పని చేసుకుంటున్న వారు హఠాత్తుగా జరిగిన ఆ పరిణామంతో ఉలిక్కిపడ్డారు.
ఈ ఫన్నీ వీడియోను ఢిల్లీ పోలీసులు delhi.police_official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 8 వేలకు పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇలాంటి స్టంట్లు చేసే ముందు మీ ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించండి``, ``అంకుల్ ఇక సైకిల్ అంటేనే భయపడతాడేమో`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.