ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: దీని ముందు పిజ్జా ఎందుకూ పనికి రాదు.. ఆసక్తిర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

ABN, Publish Date - Dec 18 , 2023 | 09:55 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర, అద్భుత వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి భారీ పరోటాను తయారు చేశాడు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర, అద్భుత వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి భారీ పరోటాను (Paratha) తయారు చేశాడు. ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఆ పరోటా ముందు పిజ్జా (Pizza) ఎందుకూ పనికిరాదని కామెంట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి హోటల్ కిచెన్‌లో ఓ భారీ పరోటాను సిద్ధం చేస్తున్నాడు. ఒకడే పరోటా ముద్దను కలిపి అందులో కూర వేసి భారీ పెనంపై కాల్చాడు. అనంతరం దానిని ఓ పెద్ద పళ్లెంలో వేసి కట్ చేసి సర్వ్ చేశారు. ఆ భారీ పరోటాను సులభంగా 8 మంది వరకు తినెయ్యొచ్చు. పరోటా తయారీకి సంబంధించిన ఆ వీడియో ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకుంది. ఆయన ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 8.2 లక్షల మందికి పైగా వీక్షించారు. 18 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అద్భుతం``, ``పిజ్జాతో పోల్చుకుంటే ఇది చాలా ఆరోగ్యకరం``, ``అద్భుతమైన ట్యాలెంట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 09:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising