ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కుక్కపిల్లను కొట్టబోయిన యజమానికి షాకింగ్ అనుభవం.. వెంటనే తల్లికుక్క ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2023-05-12T15:22:33+05:30

ఒక్కోసారి జంతువుల ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వాటిని పెంచుతున్న యజమానుల దగ్గరైనా సరే ఏ మాత్రం తగ్గవు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా తల్లులు(mothers) తమ పిల్లలను ఎంతైనా తిడతారు, కొడతారు. కానీ ఇతరులు తమ పిల్లల జోలికొస్తే మాత్రం సహించలేరు. కేవలం మనుషులే కాదండోయ్ జంతువులలో కూడా ఇంతే. ఓ కుక్క పిల్లను దాని యజమాని చెప్పుతీసుకుని కొట్టబోయాడు. అయితే అక్కడే ఉన్న తల్లి కుక్క అతను చెప్పు ఎత్తిన వెంటనే చేసిన పని చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తల్లికుక్క ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..

ఇంట్లో పిల్లలే కాదండోయ్.. జంతువుల పిల్లలు కూడా చాలా తింగరివి. బాగా అల్లరిచేస్తాయి. చిన్నపిల్లలు ఏది దొరికితే అది నోట్లో పెట్టుకోవడం, కింద పడేయం, కాగితాలు చింపేయడం వంటివి చేసినట్టు కుక్కపిల్లలు, పిల్లి పిల్లలు కూడా చెప్పులు, వైర్లు కొరికేయడం, దుప్పట్లు చింపేయడం వంటివి చేస్తుంటాయి. ఓ వ్యక్తి లాబ్రడార్ కుక్కను(Labrador dog) పెంచుకుంటున్నాడు. ఆ కుక్కకు ఓ బుజ్జి కుక్కపిల్ల పుట్టింది. ఇల్లంతా దాని ఆడింది ఆటా, పాడింది పాటా అయ్యింది. అది ఆడుకుంటూ ఎలక్ట్రిక్ బోర్డ్ వైర్ ను కొరికేసింది(biting electric board wire). దీంతో యజమానికి కోపం వచ్చింది. వీడియోలో తల్లిని, పిల్లను ముందు కూర్చోబెట్టుకుని కట్ అయిపోయిన వైర్ చూపిస్తూ అతను రెండింటినీ నిందించడం వీడియోలో చూడొచ్చు. అతను ఆ రెండింటిని కోపంగా తిట్టిన తరువాత, ఆ పని చేసింది చిన్న కుక్కపిల్ల(baby dog) కాబట్టి దానికి పనిష్మెంట్ ఇద్దామని అతను చెప్పు తీసుకని దాన్ని కొట్టబోయాడు. అయితే తల్లి కుక్క వెంటనే అలర్ట్ అయ్యింది. తన పంజాతో కుక్క పిల్లను దగ్గరగా తీసుకుంది. ఇంట్లో తండ్రి పిల్లలను కొడుతున్నప్పుడు, తల్లి పిల్లలను ఎలాగైతే దగ్గరకు లాక్కుని రక్షణ ఇస్తుందో ఈ కుక్క కూడా అలాగే చేసింది.

Beer-powered Motorcycle: ఒక్క బాటిల్ బీరు పడ్డాక ఈ బైక్ తో మామూలుగా ఉండదు.. దీని వేగమెంతో తెలిస్తే..


ఈ వీడియోను giosi.inu అనే ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లి కుక్క ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు. 'అమ్మ ప్రేమ ఇంతే' అని అంటున్నారు. ఈ తల్లి కుక్క ప్రవర్తన నెటిజన్ల హృదయాలను దోచేసింది.

Viral Video: నెట్టింట్లో వైరల్ అవుతున్న చిన్నారి డ్యాన్స్ వీడియో. ఫ్యూచర్ హీరోయిన్ అంటూ ఒకటే ప్రశంసలు.


Updated Date - 2023-05-12T15:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising