ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అమ్మాయిలూ.. బీ అలెర్ట్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారా..? ఈ యువతికి ఏం జరిగిందో చూస్తే..!

ABN, First Publish Date - 2023-05-17T19:52:13+05:30

రాను రాను సమాజంలో ఘోరాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సంఘటనలు ఆ భయాలను మరింత పెంచుతున్నాయి. రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వెళుతున్న ఈ మహిళకు జరిగింది చూసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాను రానూ.. అమ్మాయిలు ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎక్కడ చూసినా ఏవో ఒక దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎక్కడైనా దారుణం జరిగిందని వినగానే 'మనదగ్గర కాదులే.. మనకు అలాంటి పరిస్థితి రాదులే..' అనే ఆలోచనతో ధైర్యంగా బయటరు వెళుతుంటారు. అలానే ఓ అమ్మాయి రోడ్డు ప్రక్కన ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. అప్పుడే ఆ అమ్మాయి పక్కన ఓ కారు దూసుకొచ్చింది. ఆ తరువాత జరిగిన సంఘటన చూసి అమ్మాయిలందరూ బెంబేలు పడిపోతున్నారు. 'సమాజం ఇలా తయారైందేంటి?' అని విచారం వ్యక్తం చేస్తున్నారు. అసలింతకూ అక్కడేం జరిగింది? ఆడవాళ్లందరూ అంతగా విచారం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం కోయంబత్తూర్(Coimbatore) రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళుతున్న ఓ అమ్మాయికి చాలా దారుణమైన అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించి వీడియో బయట పడటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీడియోలో ఓ అమ్మాయి రోడ్డు ప్రక్కన(road side) నడుచుకుంటూ వెళుతోంది(Women walking lonely). వాహనాల రాకపోకలు ఉన్నాయి కానీ అక్కడ నడుచుకుంటూ వెళుతున్నవారు తక్కువ. అప్పుడే సడన్ గా అక్కడికి ఓ కారు దూసుకొచ్చింది(car enter the road). కారు విండోలోంచి ఓ యువకుడు చెయ్యి బయటకు పెట్టాడు. అతను వెంటనే ఆ అమ్మాయి మెడలో ఉన్న బంగారు గొలుసు పట్టుకున్నాడు(man caugth women gold chain). అమ్మాయి తన గొలుసు కాపాడుకోవడానికి ప్రయత్నించింది. కానీ కారు రన్నింగ్ లో ఉండటంతో ఆమె కింద పడిపోయింది. అయినా ఆ చైన్ స్నాచర్(chain snatcher) ఆ అమ్మాయి వదల్లేదు. చైన్ కోసం ఆమెను కొన్ని అడుగులు ఈడ్చుకెళ్ళారు(women was dragged away). కానీ వారికి గొలుసు దొరకలేదు. దీంతో వారు అక్కడినుండి ఉడాయించారు. కారు వెళ్లిపోగానే ఆ అమ్మాయి కింద పడ్డదల్లా పైకి లేచి తన చేతిక అయిన గాయాలను చూసుకుంటూ ఉండిపోయింది. ఈ సంఘటన మొత్తం రోడ్డుకు ఒకవైపుగా అమర్చిన సీసీకెమెరాలో(road side CC Camera) రికార్డయ్యింది.

Viral News: అంత్యక్రియల్లో షాకింగ్ సీన్.. చనిపోయిన భార్య కంట్లోంచి కన్నీళ్లు వస్తున్నాయేంటని భర్తకు డౌట్.. ఆస్పత్రికి తీసుకెళ్తే..!


ఈ వీడియోను ANI న్యూస్(ANI NEWS) వారు ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. '33ఏళ్ళ మహిళ ఒంటరిగా రోడ్డు ప్రక్కన వెళుతోంటే కారులో వచ్చిన చైన్ స్నాచర్లు ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయారు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు పోలీసులు(Tamin Nadu Police) అలర్ట్ అయ్యారు. మహిళ ఫిర్యాదు మెరకు ఆమె చైన్ దొంగిలించిన(chain thieves) దుండగుల కోసం వేట మొదలుపెట్టి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. అభిషేక్, శక్తివేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ మహిళ చైన్ దొంగిలించినట్టు నిర్థారణ కావడంతో వారిని అరెస్ట్ చేశారు. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్ళకండి అని హెచ్చరించారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'సమాజం మరీ ఇంత దారుణంగా తయారవుతోంది ఏంటి?' అని విచారం వ్యక్తం చేస్తున్నారు. 'ఇన్నాళ్లు బైక్ ల మీద వచ్చి చైన్ స్నాచ్ చెయ్యడం చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా కార్లలో వచ్చి దొంగతనం చేస్తున్నారా?' అంటూ తలపట్టుకుంటున్నారు.

Bride: పెళ్లి పీటలపై నుంచి మధ్యలోనే లేచి వెళ్లిపోయిన వధువు.. అసలు కారణం తెలిసి శభాష్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన బంధువులు..!


Updated Date - 2023-05-17T19:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising