Bride: పెళ్లి పీటలపై నుంచి మధ్యలోనే లేచి వెళ్లిపోయిన వధువు.. అసలు కారణం తెలిసి శభాష్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన బంధువులు..!

ABN , First Publish Date - 2023-05-17T16:20:32+05:30 IST

వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేశాడు. తరువాత ఏడడుగులు వేయించడానికి అంతా సిద్దం చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే వధువు పెళ్ళి వేదిక దిగి వెళ్ళిపోయింది. ఆమె అసలెందుకు అలా చేసిందో తెలిసిన తరువాత..

Bride: పెళ్లి పీటలపై నుంచి మధ్యలోనే లేచి వెళ్లిపోయిన వధువు.. అసలు కారణం తెలిసి శభాష్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన బంధువులు..!

రెండు కుటుంబాలకు చెందిన బందుమిత్రులు, స్నేహితులు, అతిథుల మధ్య పెళ్ళి వేడుక చాలా సంతోషంగా జరుగుతోంది. వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేసిన తరువాత ఏడడుగులు వేయించడానికి అంతా సిద్దం చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే వధువు పెళ్ళి వేదిక దిగి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళిపోతోంటే వరుడు పిచ్చివాడిలా చూశాడు. పెళ్ళిమండపంలో ఉన్న బంధుమిత్రులు ఏమయ్యిందో ఏంటోనని ఎన్నెన్నో ఊహించుకున్నారు. కానీ ఆ తరువాత నిజం తెలిసి వరుడితో సహా అందరూ ఆ అమ్మాయి మీద ఒకటే పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం ఝూన్సీ జిల్లాలో డోంగ్రీ ప్రాంతంలో కృష్ణ రాజ్ పుత్ అనే అమ్మాయి నివసిస్తోంది. ఆమెకు బబినా ప్రాంత నివాసి అయిన యశ్ పాల్ సింగ్ అనే కుర్రాడితో పెళ్ళి నిశ్చయమైంది. వీరి పెళ్ళి మే 16 తేదీన నిర్ణయించారు. ఇందుకోసం మే 15 వతేదీన వరుడు(Groom), అతని కుటుంబ సభ్యులు(groom family) వధువు గ్రామానికి(bride village) చేరుకున్నారు. 16వ తేదీన పెళ్ళివేడుక ఎంతో ఘనంగా జరుగుతోంది. వరుడు వధువుకు మూడుముళ్ళు వేశాక ఏడడుగులు వేయించడానికి అంతా సిద్దం చేస్తున్నారు. అప్పుడే వధువు ఒక్కసారిగా వేదిక దిగి వెళ్ళిపోయింది. ఆమె కంగారుగా పరిగెడుతోంటే ఏం జరిగిందో అర్థం కాక వరుడు జుట్టుపీక్కున్నాడు. పెళ్ళికి వచ్చిన అతిథులంతా ఎవరికి తోచింది వారు ఊహించుకున్నారు. అందరి ఊహాగానాలకు తెరదించుతూ వధువు కుటుంబంలో ఓ వ్యక్తి నిజం బయటపెట్టారు. వధువు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది(bride study degree final year), ఆ పరీక్ష పెళ్ళి రోజే ఉండటం వల్ల పరీక్షకు హాజరయ్యేందుకు(attend for exam) ఆమె అలా వెళ్ళినట్టు తెలిపారు.

Shocking Video: పామును పెంచుకున్నాడు కానీ.. ఇలా వాడేశాడేంటి..? నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసేశాడు.. పోలీసులు రాగానే..!


నిజానికి ఆ అమ్మాయి పరీక్ష మే 4 వతేదీ అయిపోవాల్సింది. కానీ అక్కడి ఎన్నికల కారణంగా పరీక్షను ఆపేశారు(exam postpone about elections), పరీక్షను 16వ తేదీ నిర్వహించాలని నిర్ణయించారు. 16వ తేదీ ఆమె పెళ్ళి ఉండటంతో ఇక పరీక్ష రాయడం కుదరదని ఆమె కుటుంబ సభ్యులు కూడా అనుకున్నారు. కానీ కాలేజ్ మేనేజ్మెంట్ తో ముందుగా మాట్లాడిన అమ్మాయి తాను పరీక్షకు హాజరవుతానని చెప్పింది. అందుకోసమే అలా వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఈ విషయం వినగానే వరుడు, అతని కుటుంబ సభ్యులు, పెళ్ళికి విచ్చేసిన అతిథులు ఎంతో సంతోషించారు. ఆ అమ్మాయి చాలామంచి పని చేసిందంటూ మెచ్చుకున్నారు.

Father: కూలర్ దగ్గర నిద్రపోదామంటూ నాయనమ్మ వద్ద నుంచి కొడుకును తీసుకెళ్లిన తండ్రి.. ప్రేమగా పిలుస్తున్నాడని ఆ పిల్లాడు వెళ్తే..!


Updated Date - 2023-05-17T16:20:32+05:30 IST