Father: కూలర్ దగ్గర నిద్రపోదామంటూ నాయనమ్మ వద్ద నుంచి కొడుకును తీసుకెళ్లిన తండ్రి.. ప్రేమగా పిలుస్తున్నాడని ఆ పిల్లాడు వెళ్తే..!

ABN , First Publish Date - 2023-05-17T14:26:12+05:30 IST

మనవడిని ఎత్తుకెళుతున్న కొడుకును చూసి ఎంతో మురిసింది ఆ పెద్దావిడ. కానీ ఉదయాన్నే గదిలోకి వెళ్ళి చూస్తే..

Father: కూలర్ దగ్గర నిద్రపోదామంటూ నాయనమ్మ వద్ద నుంచి కొడుకును తీసుకెళ్లిన తండ్రి.. ప్రేమగా పిలుస్తున్నాడని ఆ పిల్లాడు వెళ్తే..!

7ఏళ్ళ పిల్లాడు ఇంట్లో నానమ్మ దగ్గర నిద్రపోతున్నాడు. అప్పుడే అక్కడికి పిల్లాడి తండ్రి వచ్చాడు. 'పైన గదిలో కూలర్ ఉంది కదా అక్కడ చల్లగా ఉంటుంది నాతో పడుకుందువురా..' అంటూ పిల్లాడిని ప్రేమగా ఎత్తుకెళ్ళాడు . కొడుకు మీద ఎంత ప్రేమో అని పిల్లాడి నాయనమ్మ కొడుకును, మనవడిని చూసి మురిసిపోయింది. కానీ ఉదయానికల్లా ఆ పిల్లాడు విగతజీవిగా కనిపించాడు. రాత్రికి రాత్రే పిల్లాడికేమయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ పోలీసుల విచారణలో చాలా దారుణమైన నిజాలు బయటపడ్డాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్(Indore) లో తేజాజీ నగర్ పరిధిలో శిశుపాల్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి 7ఏళ్ళ కొడుకున్నాడు. ఆ బాబు పేరు ప్రతీక్. శిశపాల్ తన తల్లిదండ్రులు, మమత, ప్రతీక్ తో కలసే ఉంటున్నాడు. మమత గర్భవతి కావడంతో ప్రసవానికి ఆమె పుట్టింటికి వెళ్ళింది. సోమవారం రాత్రి ప్రతీక్ తన నానమ్మ దగ్గర నిద్రపోతుండగా శిశుపాల్ వారి దగ్గరకు వెళ్ళాడు. 7ఏళ్ళ ప్రతీక్(7years kid ) తో 'పైన కూలర్(cooler) ఉంది కదా, అక్కడ చల్లగా ఉంటుంది నా దగ్గర పడుకుందువురా' అని తనతో మేడ మీద గదిలోకి తీసుకెళ్ళాడు. పిల్లాడిని మంచం మీద కూర్చో బెట్టి వారు కూర్చున్న చోటుకు ఎదురుగా మొబైల్ ఉంచి కెమెరా ఆన్ చేశాడు. 'నీకు మమత అమ్మ అంటే ఇష్టమా?' అని పిల్లాడిని ప్రశ్నించాడు. ఇష్టం లేదని పిల్లాడు చెప్పడంతో అతను వెంటనే ప్రతీక్ గొంతు పట్టుకున్నాడు. తన తండ్రి తనతో ఆడుకుంటున్నాడని భావించి ప్రతీక్ దాన్ని సరదాగా తీసుకున్నాడు. కానీ శిశుపాల్ చేతులు ప్రతీక్ గొంతు మీద బిగుసుకోవడంతో ప్రతీక్ మెలికలు తిరిగిపోయాడు. కొద్దిసేపటి తరువాత ప్రతీక్ మంచం మీద ఒరిగిపోయాడు. పిల్లాడి గొంతు వదిలేసిన శిశుపాల్ ఇంకా బాబులో ఏమైనా ప్రాణముందేమో అని మళ్ళీ రెండోసారి గొంతు పిసికాడు. కొద్ది సేపటిలోనే ప్రతీక్ ముక్కుల్లోనుండి రక్తం(Blood become from nose) వచ్చింది. ఆ తరువాత గుండె కొట్టుకుంటోందో(Heart beat) లేదో చెక్ చేసి పిల్లాడు మరణించాడని ధృవీకరించుకున్నాడు.

Viral Video: అమ్మబాబోయ్.. వీడికెంత ధైర్యం.. 12 అడుగుల పొడవున్న కోబ్రాను చేత్తో పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తోంటే..!


ప్రతీక్ మరణించాక తన మొబైల్ లో రికార్డ్ అయిన వీడియో తన భార్య మమతకు పంపించాడు. 'నువ్వు చెప్పినట్టే నేను ప్రతీక్ ను చంపేశాను, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు' అని ఆమెకు కాల్ చేసి చెప్పాడు. ఆ తరువాత అక్కడి నుండి పారిపోయాడు. అయితే మరుసటి రోజు ఉదయం మేడ మీదకు వెళ్ళిన ప్రతీక్ నాయనమ్మకు ప్రతీక్ విగతజీవిగా కనిపించడంతో విషయం పోలీసులకు చేరింది. పోలీసులు విచారించగా తండ్రే కొడుకును హత్య చేసినట్టు(father kills son) బయటపడింది. కాగా ప్రతీక్, శిశుపాల్ మొదటి భార్యకు(first wife son) పుట్టినవాడని, మమత శిశుపాల్ కు మూడవ భార్యని(third wife) తెలిసింది. 'ప్రతీక్ ఆ ఇంట్లో ఉంటే నేను ఇంట్లో అడుగు పెట్టను, వాడిని ఏదో ఒకటి చేసి వదిలించుకో.. చంపెయ్..' అని మమత ఒత్తిడి చేయడంతో శిశుపాల్ కొడుకును చంపేసినట్టు తెలిసింది. పారిపోయిన అతన్ని రాత్రికల్లా వెతికి పట్టుకున్నారు. ప్రతీక్ ను హత్య చేస్తుండగా తీసీన 7నిమిషాల వీడియో(7 minutes murder video) అతని మొబైల్ లో బయటపడింది. హత్యకు ప్రేరేపించినందుకు మమత మీద కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Shocking Video: పామును పెంచుకున్నాడు కానీ.. ఇలా వాడేశాడేంటి..? నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసేశాడు.. పోలీసులు రాగానే..!


Updated Date - 2023-05-17T14:26:12+05:30 IST