Viral Video: అమ్మబాబోయ్.. వీడికెంత ధైర్యం.. 12 అడుగుల పొడవున్న కోబ్రాను చేత్తో పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తోంటే..!

ABN , First Publish Date - 2023-05-15T18:38:15+05:30 IST

నది ఒడ్డున జరజరా పాకుతూ పోతోంటే కుతూహలం కొద్దీ పట్టాడు. అంతే సరదాతో దానికి ముద్దెట్టబోయాడు. ఆ తరువాత జరిగింది చూస్తే

Viral Video: అమ్మబాబోయ్.. వీడికెంత ధైర్యం.. 12 అడుగుల పొడవున్న కోబ్రాను చేత్తో పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తోంటే..!

కొందరి సాహసాలు చూస్తే 'వామ్మో వీళ్ళకెంత గుండె ధైర్యంరా బాబోయ్' అనిపిస్తుంది. 12అడుగుల పామును పట్టుకుని, దాని తలమీద ఏకంగా ముద్దుపెట్టుకోవడానికి సిద్దమయ్యాడొక వ్యక్తి. అలా అని అదేమీ పెంపుడు పాము కాదండోయ్.. అక్షరాలా నది ఒడ్డున జరజరా పాకుతూ పోతోంటే కుతూహలం కొద్దీ పట్టాడు. అంతే సరదాతో దానికి ముద్దెట్టబోయాడు. ఆ తరువాత జరిగింది చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'అసలు అతను మనిషేనా.. లేక మానవాతీత శక్తులు ఏమైనా ఉన్నాయా?' అంటున్నారు ఈ వీడియో చూసినవాళ్లు. దీని గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

పాము(Snake) అనగానే భయంతో పారిపోయే వాళ్ళే ఎక్కువ. అది చిన్నదా పెద్దదా అని కూడా ఆలోచించరు, విషపూరితమైనదా లేదా విషపూరితం కానిదా అనే క్వశ్చన్ కూడా వేయరు. కానీ కొందరు సాహసాలు చేస్తారు. అలవోకగా పాముల్ని తాడులు(ropes) పట్టుకున్నట్టు పట్టేస్తారు. ఓ వ్యక్తి అలాగే చేశాడు. అది అల్లాటప్పా పాము కాదు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా(king cobra).. అది కూడా పిల్ల పామేం కాదు. ఏకంగా 12(12feet king cobra) అడుగుల పొడవుంది. అంటే.. మనిషి పొడవుకు రెండింతలు పైమాటే.. అంత పొడవు, పొడవుకు తగ్గ లావు ఉన్న కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి ఒట్టి చేతులతో(bare hands) పట్టుకున్నాడు. వీడియోలో పాము పడగ విప్పి ఇంతెత్తున లేచి ఉండటం చూడొచ్చు. ఈ పాముకు ఎదురుగా ఓ వ్యక్తి ఉన్నాడు. అతను పామును ఎడమ చేత్తో పట్టుకుని ఉన్నాడు. అసలు భయం కానీ, టెన్షన్ కానీ అతనిలో లేనే లేవు. పైపెచ్చు దాన్ని చూసి ఏదో ఫన్నీగా నవ్వుతున్నాడు. అతను తెలివిగా పామును వెనక్కు తిప్పాడు. దీంతో పాము తల వెనుక భాగం అతనికి ఎదురుగా మారింది. అతను మెల్లిగా పామును ముందుకు తీసుకుని దాని తల వెనుక చిన్నపిల్లలకు పెట్టినట్టు ముద్దు(man kiss to king cobra) పెట్టుకున్నాడు.

పేస్టు.. టూత్ బ్రష్ ఎక్కడ పెడుతుంటారు? బాత్రూమ్ లోనా? బయటా? తెలియకుండానే ఎంత పెద్ద తప్పు చేసేస్తున్నారో..


ఈ వీడియోను nicthewrangler అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్(Instagram account) నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. 'వామ్మో ఇతనికెంత ధైర్యం అంత పెద్ద పామును ముద్దుపెట్టుకుంటున్నాడు' అని కామెంట్స్ చేస్తున్నారు. 'అతనికేమైనా అతీంద్రీయ శక్తులున్నాయా? అతని చేతిలో ఆ పాము ఎంత బుద్దిగా ఒదిగిపోయిందో' అని అంటున్నారు. 'ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పామును తాడులా హ్యాండిల్ చేశాడు. అతనిది గుండెనా లేకా రాయా మరీ ఇంత ధైర్యమేంటి?' అంటున్నారు.

Viral Video: పులితో ఫోటో దిగుతున్న కుర్రాళ్ళకు ఊహించని షాక్.. క్షణాల్లోనే మారిపోయిన సీన్.. జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు..


Updated Date - 2023-05-15T18:38:15+05:30 IST