Shocking Video: పామును పెంచుకున్నాడు కానీ.. ఇలా వాడేశాడేంటి..? నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసేశాడు.. పోలీసులు రాగానే..!

ABN , First Publish Date - 2023-05-16T20:29:56+05:30 IST

ఓ వ్యక్తి సరదాగా పామునుపెంచుకున్నాడు. కానీ దాంతో అతను ఏం చేశాడో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

Shocking Video: పామును పెంచుకున్నాడు కానీ.. ఇలా వాడేశాడేంటి..? నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసేశాడు.. పోలీసులు రాగానే..!

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమన అన్నాడు. దానికి తగ్గట్టే మనుషులలో కూడా వింత మనుషులు ఉంటారు. కొందరి ప్రవర్తన చూస్తే విస్తుపోవాల్సి ఉంటుంది. చాలామంది కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటారు. కొందరు ధైర్యం చేసి పులులను, సింహాల్ని, పాముల్ని పెంచుకుంటారు. ఓ వ్యక్తి అలాగే సరదాగా పామును(snake) పెంచుకున్నాడు. కానీ దాన్ని అతను ఏం చేశాడో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 'ఓరినీ నీకేం పోయేకాలంరా నాయనా..' అని కళ్ళు తేలేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

కెనడా(Canada) దేశానికి చెందిన లారేనియో అనే వ్యక్తి పామును పెంచుకున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతను రోడ్డు మీద ఓ వ్యక్తితో గొడవకు(street fight) దిగాడు. ఆ గొడవలో తన ప్రత్యర్థిని కొట్టడానికి అతను ఏకంగా తన పెంపుడు పామును(using snake for beating) ఉపయోగించాడు. తాడును ఎలాగైతే పట్టుకుంటామో అలా పామును మడతవేసి పట్టుకున్నాడు. దాంతో ఎదుటి వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టడం వీడియోలో చూడొచ్చు. సాధారణంగా ఏ తాడుతోనో అలా కొడితే పెద్దగా భయపడాల్సిన పనిలేదు, కానీ అది పాము కావడంతో ఎదుటి వ్యక్తి బెంబేలు పడిపోయాడు. గట్టిగట్టిగా కేకలు వేశాడు. చుట్టుప్రక్కల వారు ఈ సంఘటనను చూసి షాకైపోయారు. అప్పుడే అక్కడికి టొరంటో పోలీసులు(Toronto police) వచ్చారు. వారు రాగానే ప్రత్యర్థిని కొడుతున్న వ్యక్తి కొట్టడం ఆపేశాడు. తన చేతిలో ఉన్న పామును వదిలేశాడు. ఆ తరువాత అతను సరెండర్ అయిపోతున్నట్టు చేతులు తల వెనుక పెట్టి నేలమీద పడుకునేశాడు. ఆ పాము బ్రతికిపోయానురా దేవుడా అన్నట్టు జరజరా పాకుతూ పోవడం వీడియోలో చూడచ్చు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు.

Shocking Video: ఈత కొడుతున్న ముగ్గురు స్నేహితులు.. సడన్‌గా వాళ్ల మధ్యలోకి వచ్చినదేంటో చూసి గుండె ఆగిపోయినంత పనయింది.. చివరకు..!


ఈ వీడియోను Crazy Clips అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. 'వ్యక్తి స్ట్రీట్ గొడవలో ప్రత్యర్థిని కొట్టడానికి పెంపుడు పామును ఉపయోగించాడు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కళ్ళు తేలేస్తున్నారు. 'నీకేం పోయేకాలంరా నాయనా పామును అలా వాడేశావు' అని అతన్ని తిట్టిపోస్తున్నారు. 'అతను పామును చాలా హింసించాడు, జంతుహింస కింద అతనికి కఠినమైన శిక్ష వేయాలి' అని కొందరు జంతు ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు. 'ఎంత పెంపుడు పాము అయితే మాత్రం అలా చేతిలో పట్టుకుని తిరుగుతారా?' అని అతని మీద మండిపడుతున్నారు. కాగా పోలీసులు అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ కు పంపినట్టు తెలిసింది.

Viral Video: బుడ్డోడే కానీ బాగా తెలివున్నోడు.. అమ్మ ప్రేమంటే ఏంటో తెలిసినోడు.. ఓ గొర్రెపిల్ల తప్పిపోతే స్వయంగా తీసుకెళ్లి మరీ..!


Updated Date - 2023-05-16T20:30:33+05:30 IST