Viral News: అంత్యక్రియల్లో షాకింగ్ సీన్.. చనిపోయిన భార్య కంట్లోంచి కన్నీళ్లు వస్తున్నాయేంటని భర్తకు డౌట్.. ఆస్పత్రికి తీసుకెళ్తే..!

ABN , First Publish Date - 2023-05-17T18:13:38+05:30 IST

ఓ భర్త, తన భార్య చనిపోయిందని ఎంతోదుఃఖంలో ఉన్నాడు. కన్నీళ్లు దిగమింగుకుంటూ ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. అప్పుడే చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. భార్య కంట్లోంచి కన్నీళ్ళు రావడం భర్త చూశాడు. 'నేనేమైనా పొరపడ్డానా? నా కన్నీళ్లే నాకు ఇలా భ్రమ కల్పిస్తున్నాయేమో' అనుకున్నాడు. కానీ

Viral News: అంత్యక్రియల్లో షాకింగ్ సీన్.. చనిపోయిన భార్య కంట్లోంచి కన్నీళ్లు వస్తున్నాయేంటని భర్తకు డౌట్.. ఆస్పత్రికి తీసుకెళ్తే..!

భార్యాభర్తల బంధం చాలా గొప్పది. మధ్యలో మొదలయ్యే ఈ బంధం ప్రాణం పోయేవరకు ఉంటుంది. భార్య కానీ, భర్త కానీ తమ భాగస్వామి చనిపోతే అనుభవించే బాధ ఆ దేవుడికే ఎరుక. ఓ భర్త, తన భార్య చనిపోయిందని అంతే దుఃఖంలో ఉన్నాడు. కన్నీళ్లు దిగమింగుకుంటూ ఆమెకు అంత్యక్రియలు(funeral) నిర్వహిస్తున్నాడు. అప్పుడే చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. భార్య కంట్లోంచి కన్నీళ్ళు(tears from dead body eyes) రావడం భర్త చూశాడు. 'నేనేమైనా పొరపడ్డానా? నా కన్నీళ్లే నాకు ఇలా భ్రమ కల్పిస్తున్నాయేమో' అనుకున్నాడు. కానీ ఆమె శరీరమంతా చెమటలు పడుతున్నాయని అంత్యక్రియలకు హాజరైన వారు చెప్పడంతో అతను షాకయ్యాడు. 'నా భార్య ప్రాణాలతోనే ఉంది, ఆమెను కాపాడుకోవాలి' అని హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

జార్ఖాండ్(Jharkhand), పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఘట్ శిలా లో విరామ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని భార్య(30) పూల్ మణి కి కామెర్ల జబ్బు(jaundice) వచ్చింది. దీంతో ఆమెను ఈనెల 4వతేదీన సుబర్ణరేఖ నర్సింగ్ హోమ్(Subarnarekha nursing home) లో చేర్పించాడు. అక్కడి వైద్యులు ఫూల్మణికి కొంత చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కు తీసుకెళ్ళమని చెప్పారు. దీంతో ఫూల్మణిని నర్సింగ్ హోమ్ నుండి ఘట్ శిలా సబ్ డివిజన్ హాస్పిటల్(Sub division hospital) కు తీసుకెళ్ళారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. దీంతో ఫూల్మణి భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాకయ్యారు. 'ట్రీట్మెంట్ కోసం తీసుకొస్తే చనిపోయిందంటారేంటి?' అని విరామ్ వైద్యులను ప్రశ్నించాడు. ఆమె ఎలా మరణించిందో తమకు తెలియదని సబ్ డివిజనల్ హాస్పిటల్ వారు చెప్పారు. ఆమెను ఎక్కడినుండి తీసుకొచ్చారని సబ్ డివిజన్ హాస్పిటల్ వారు ప్రశ్నించారు. సుబర్ణరేఖ నర్సింగ్ హోమ్ లో చిక్సిత కోసం తీసుకెళ్ళామని, అక్కడి వైద్యులు చిక్సిత చేశారని అతను చెప్పాడు. చికిత్సలో ఉండగా తన భార్య మద్యాహ్నం భోజనం కూడా చేసిందని, ఆ తరువాత హాస్పిటల్ వారు ఆమెకు మందులు, ఇంజెక్షన్ ఇచ్చారని తెలిపాడు. తప్పుడు ఇంజక్షన్(Wrong injection) ఇవ్వడం వల్లే ఆమె మృతిచెందిందని ఆరోపించాడు. తరువాత భార్య మృతదేహాన్ని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు.

Bride: పెళ్లి పీటలపై నుంచి మధ్యలోనే లేచి వెళ్లిపోయిన వధువు.. అసలు కారణం తెలిసి శభాష్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన బంధువులు..!


భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన మరుసటిరోజు ఆమెకు అంత్యక్రియలు చేస్తుండగా ఆమె కంట్లోంచి కన్నీళ్ళు వస్తుండటం ఆమె భర్త చూశాడు. తను పొరపడుతున్నానేమో అని అతను అనుకున్నాడు. కానీ ఆమె శరీరమంతా చెమటలు పడుతుండటం అక్కడున్న అందరూ గమనించారు. దీంతో వారందరూ షాకయ్యారు. తన భార్య బ్రతికే ఉంటుందన్న ఆశ ఆ భర్త మనసులో ఏ మూలో చిగురించింది. ఆమెను కాపాడుకోవాలనే తాపత్రయంతో అతను హుటాహుటిన ఆమెను మళ్ళీ సబ్ డివిజన్ హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. హాస్పిటల్ లో వైద్యులు ఆమెను పరీక్షించి ఆమె మృతి చెందిందని నిర్థారించారు. కానీ ఆమె భర్త మాత్రం ఆ మాటలు నమ్మలేదు. 'నా భార్య బ్రతికే ఉంటుంది సరిగా చూడండి' అంటూ మొండి చేశాడు. చివరికి పోలీసులు, బంధువులు నచ్చజెప్పి వారిని అక్కడి నుండి పంపేశారు.

Father: కూలర్ దగ్గర నిద్రపోదామంటూ నాయనమ్మ వద్ద నుంచి కొడుకును తీసుకెళ్లిన తండ్రి.. ప్రేమగా పిలుస్తున్నాడని ఆ పిల్లాడు వెళ్తే..!


Updated Date - 2023-05-17T18:13:38+05:30 IST