OMG: చేసేది కూరగాయల వ్యాపారం.. కేవలం 6 నెలల్లో ఏకంగా రూ.21 కోట్ల సంపాదన.. ఇతడి గురించి పోలీసులు ఆరా తీస్తే..!
ABN, First Publish Date - 2023-11-15T19:11:48+05:30
అతడు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుంటాడు.. ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు.. అయితే అతడు పేదవాడు కాదు.. కోటీశ్వరుడు.. కేవలం ఆరు నెలల వ్యవధిలో 21 కోట్ల రూపాయల మేర సంపాదించాడు.. అతడి గురించి తెలుసుకుని పోలీసులు కూడా షాకయ్యారు..
అతడు రోడ్డు పక్కన కూరగాయలు (Vegetable seller) అమ్ముతుంటాడు.. ఢిల్లీకి (Delhi) ఆనుకుని ఉన్న గురుగ్రామ్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు.. అయితే అతడు పేదవాడు కాదు.. కోటీశ్వరుడు.. కేవలం ఆరు నెలల వ్యవధిలో 21 కోట్ల రూపాయల మేర సంపాదించాడు.. అతడి గురించి తెలుసుకుని పోలీసులు కూడా షాకయ్యారు.. అసలు విషయం తెలుసుకుని నివ్వెరపోయారు.. గురుగ్రామ్ (Gurgaon)లో కూరగాయలు అమ్మే రిషబ్ శర్మ అనే 27 ఏళ్ల నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నారు (Crime News).
రిషబ్ శర్మ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ ద్వారా రూ.21 కోట్లు మోసం చేసి 10 రాష్ట్రాలకు తన నెట్‌వర్క్‌ను విస్తరించాడు. అతడి మీద వివిధ రాష్ట్రాల్లో మొత్తం 37 కేసులు నమోదయ్యాయి. ఫ్రాడ్ ఇంటర్నేషనల్ కార్టెల్‌లో పనిచేసి చైనా, సింగపూర్, హాంకాంగ్ నుంచి హవాలా ద్వారా క్రిప్టో కరెన్సీలో నగదు లావాదేవీలు జరిపాడు. రిషబ్ ఆరు నెలల క్రితం ఈ పని ప్రారంభించి కోట్లు సంపాదించాడు. సొంతంగా ఓ ముఠాను ఏర్పరుచుకుని నెట్‌వర్కను వివిధ రాష్ట్రాలకు విస్తరించాడు. రిషబ్ ముఠా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను ట్రాప్ చేసి వారిని మోసగించి డబ్బులు వసూలు చేసేవారు (Cyber Crime).
Wife-Husband: 8 ఏళ్ల క్రితమే పెళ్లి.. ఇద్దరు కూతుళ్లు కూడా.. వీళ్ల హ్యాపీ లైఫ్‌తో విధి ఆడుకుందో ఆట.. ఒకే ఒక్క ఘటనతో..!
రిషబ్ ముఠాలో ఓ వ్యక్తి బాగా డబ్బున్న వారి ఫోన్ నంబర్లు సేకరిస్తాడు. ఆయా వ్యక్తులకు రిషబ్ ముఠా కాల్స్ చేసి ట్రాప్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఉన్నాయని, బహుమతులు వచ్చాయని, లాటరీ తగిలిందని, క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ అని.. ఇలా రకరకాలుగా వివిధ వ్యక్తులకు ఫోన్స్ చేసి వారిని మోసం చేసి వేలు, లక్షల్లో కాజేశారు. అలా ఈ ముఠా గత ఆరు నెలల కాలంలో 30 కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడింది. రిషబ్‌పై వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.
Updated Date - 2023-11-15T19:11:51+05:30 IST