Shocking: టూత్‌బ్రష్‌తో జైలు గోడలకు రంధ్రం చేసి పరార్.. చివరకు వారు ఎలా దొరికిపోయారంటే..
ABN, First Publish Date - 2023-03-25T19:32:51+05:30
జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు (Prisoners) రకరకాల ప్లాన్లు వేయడం, ఎంతో సాహసం చేసి తప్పించుకోవడం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం.
జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు (Prisoners) రకరకాల ప్లాన్లు వేయడం, ఎంతో సాహసం చేసి తప్పించుకోవడం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం. అయితే అమెరికాలోని (USA) ఇద్దరు ఖైదీలు సినిమాల్లో చూపించినట్టే ఎంతో కాలం కష్టపడి తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే జైలు (Jail) గోడలకు కన్నం పెట్టి పారిపోయారు. అయితే ఆహారానికి ఆశపడి ఓ రెస్టారెంట్లోకి వెళ్లి స్వల్ప వ్యవధిలోనే పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Story).
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన జాన్ గార్జా(37), అర్లె నెమో(43) అనే ఇద్దరు వ్యక్తులను వేర్వేరు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. జైలులో పరిచయం పెంచుకున్న ఆ ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మాస్టర్ ప్లాన్ వేశారు. తమ దగ్గర ఉన్న ఓ టూత్ బ్రష్ (Toothbrush), ఓ స్క్రూ డ్రైవర్ సహాయంతో జైలు గోడకు రోజుల తరబడి రంధ్రం చేశారు. గత ఆదివారం రాత్రి వారిద్దరూ ఆ రంధ్రం గుండా బయటకు వెళ్లిపోయారు. సోమవారం అటెండెన్స్ వేస్తున్న సమయంలో వారిద్దరూ తప్పించుకున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే టీవీల్లో వారి పరారీ గురించి ప్రకటనలు గుప్పించారు.
Viral: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని చెప్పిన యువకుడు.. ఏకంగా పెళ్లే రద్దు చేసుకున్న యువతి.. అసలు కథేంటంటే..
నిందితులు ఎక్కువ దూరం పారిపోకుండా ఓ రెస్టారెంట్లోకి వెళ్లి పాన్ కేక్‌లు (Pancakes) తినడం మొదలుపెట్టారు. రెస్టారెంట్‌లోని ఇతర వ్యక్తులు వారిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆ రెస్టారెంట్ వద్దకు చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు ఖైదీలు పారిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral: తన భర్తకు మరో యువతిని గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య.. ఇదంతా ఆమె ఎందుకు చేసిందో తెలిస్తే షాకవక తప్పదు..
Updated Date - 2023-03-25T19:32:51+05:30 IST