ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Woman: దారుణం.. బస్ ఎక్కిన మహిళకు ఫిట్స్ .. హాస్పిటల్‌కు తీసుకెళ్తామన్న యువకులు.. ఎంత నీచానికి పాల్పడ్డారంటే.. పోలీసులకు చెప్పినా..!

ABN, First Publish Date - 2023-11-15T17:03:47+05:30

ఆమె ఈ నెల 9వ తేదీన ఆమె బస్ ఎక్కి ఇంటికి వెళ్తోంది.. బస్‌లో ఉండగా ఆమెకు ఫిట్స్ వచ్చాయి.. ముగ్గురు యువకులు వెంటనే బస్ ఎక్కి ఆమె తమకు తెలుసని చెప్పారు.. హాస్పిటల్‌కు తీసుకెళ్తామని చెప్పి ఆమెను బైక్ ఎక్కించుకున్నారు.. ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు..

ఆమె ఈ నెల 9వ తేదీన ఆమె బస్ ఎక్కి ఇంటికి వెళ్తోంది.. బస్‌లో ఉండగా ఆమెకు ఫిట్స్ వచ్చాయి.. ముగ్గురు యువకులు వెంటనే బస్ ఎక్కి ఆమె తమకు తెలుసని చెప్పారు.. హాస్పిటల్‌కు తీసుకెళ్తామని చెప్పి ఆమెను బైక్ ఎక్కించుకున్నారు.. ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు.. అప్పుడే ఫిట్స్ బారిన పడిందనే కనికరం కూడా లేకుండా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను రోడ్డు పక్కన నగ్నంగా వదిలేసి పరారయ్యారు (Crime News).

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గ్రేటర్ నోయిడా (Greater Noida)లోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ నవంబర్ 9వ తేదీన ఘజియాబాద్‌కు వెళ్లేందుకు బస్ ఎక్కింది. బస్‌లో ఉండగా ఆమె ఫిట్స్‌కు గురైంది. బస్ కండక్టర్ ఆమెను కిందకు దించి మంచినీళ్లు అందించారు. ఆ సమయంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చి తమకు ఆమె పరిచయస్తులమని చెప్పి వెంట తీసుకెళ్లారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం ముగ్గురూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Amazon: అమెజాన్‌లో అందుబాటులో ఉన్న 5 చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదీ.. ఈ ఆఫర్లు ఉపయోగించుకుంటే..!

అత్యాచారం అనంతరం ఆమెను నగ్నంగా రోడ్డు పక్కన పడేసి నిందితులు ముగ్గురూ పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన మహిళ బట్టలు వేసుకుని ఇంటికి వెళ్లింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదు. ఆరు రోజులు గడిచినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో బాధితురాలు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమేరాలను పరిశీలిస్తున్నారు.

Updated Date - 2023-11-15T17:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising