Viral Video: రోడ్డు ప్రక్క వ్యక్తి ట్యాలెంట్‌కు ప్రముఖ గాయని ఫిదా.. వీడియో చూస్తే మీరు కూడా ఇష్టపడకుండా ఉండలేరు..
ABN, First Publish Date - 2023-06-11T17:04:30+05:30
ప్రతిభ అనేది ఎవరి సొత్తూ కాదు.. ప్రతిభకు తగిన వేదిక దొరికితే ఎంతో మంది అద్భుతంగా అభివృద్ధి చెందుతారు.. సరైన ప్లాట్‌ఫామ్ లేక ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు సామాన్యులుగానే ఉండిపోతున్నారు.. మన సాధారణ జీవితంలో రోడ్ల మీద, బస్సులోనూ, మన ఊళ్లలోనూ ఎంతో మంది ప్రతిభావంతులు కనబడుతూ ఉంటారు.
ప్రతిభ (Talent) అనేది ఎవరి సొత్తూ కాదు.. ప్రతిభకు తగిన వేదిక దొరికితే ఎంతో మంది అద్భుతంగా అభివృద్ధి చెందుతారు.. సరైన ప్లాట్‌ఫామ్ లేక ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు సామాన్యులుగానే ఉండిపోతున్నారు.. మన సాధారణ జీవితంలో రోడ్ల మీద, బస్సులోనూ, మన ఊళ్లలోనూ ఎంతో మంది ప్రతిభావంతులు కనబడుతూ ఉంటారు.. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు అద్భుతమైన గాయకులు కనబడుతూ ఉంటారు.. వారి స్వరం, సంగీత జ్ఞానం మనల్ని అబ్బుర పరుస్తాయి.
అలాంటి అద్భుత ప్రతిభావంతుడు తన సంగీత జ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలను ఆకట్టుకుంటూ రోడ్డు పక్కన భిక్షాటన చేస్తున్నాడు. శాస్త్రీయ సంగీత దిగ్గజం అశ్విని భిడే దేశ్‌పాండే (Ashwini Bhide) ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి సారంగి (Sarangi)ని ప్లే చేస్తున్నాడు. అతడి పక్కన అతడి భార్య కూర్చుని ఉంది. అతడు సారంగితో రాజస్థాన్ జానపద పాట ``పదరే మ్హరే దేశ్`` ట్యూన్‌ను అద్భుతంగా ప్లే చేస్తున్నాడు. విన్న వారు మంత్రముగ్ధులౌతున్నారు.
Viral Video: ఏంటి తమ్ముడూ.. లైక్స్ కోసం ఇంతలా దిగజారాలా?.. గౌను వేసుకుని మార్కెట్‌లో తిరిగిన యువకుడు.. నెటిజన్లు రియాక్షన్లు ఏంటంటే..?
అతడు రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేస్తుండగా గాయని అశ్వినీ చూశారు. అతడు వాయిస్తుండగా అక్కడ ఉండి స్వయంగా జానపద పాటను హమ్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 1.3 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. అతడి అద్భుత ప్రతిభపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ``ఒక లెజెండ్ మాత్రమే నిజమైన ప్రతిభను అభినందించగలర``ని ఒకరు కామెంట్ చేశారు.
Updated Date - 2023-06-11T17:04:30+05:30 IST