ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

House For Rent: అద్దె ఇల్లు వెతుక్కుంటున్న ఓ బ్యాచిలర్‌కు షాకింగ్ అనుభవం.. ఇంటి ఓనర్లు ఈమధ్య ఇలాంటి వివరాలు కూడా అడుగుతున్నారా..?

ABN, First Publish Date - 2023-03-21T10:53:00+05:30

నగరాల్లోనూ, మెట్రో సిటీల్లోనూ బ్యాచిలర్లకు అద్దెకు ఇళ్లు దొరకడమంటే అంత సులభం కాదు. అందులోనూ బెంగళూరు వంటి కాస్మోపాలిటన్ సిటీలో మరింత కష్టం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నగరాల్లోనూ, మెట్రో సిటీల్లోనూ బ్యాచిలర్లకు అద్దెకు ఇళ్లు (Rented Houses) దొరకడమంటే అంత సులభం కాదు. అందులోనూ బెంగళూరు (Bengaluru) వంటి కాస్మోపాలిటన్ సిటీలో మరింత కష్టం. ఇంటి యజమానులు పెట్టే సవాలక్ష కండీషన్లకు ఓకే చెప్పాలి. వారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. తాజాగా బెంగళూరులో ఇంటి కోసం వెతుకుతున్న ఓ యువకుడికి ఇంటి ఓనర్ (House Owner) నుంచి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఆ విషయాన్ని ఆ యువకుడు ట్విటర్ ద్వారా తెలియజేశాడు (Viral News).

బెంగళూరులో ఉద్యోగం సంపాదించిన గౌతమ్ అనే యువకుడు ఇంటి కోసం 12 రోజులుగా తిరుగుతున్నాడు. ఇందిరానగర్ ప్రాంతంలో ఓ ఇల్లు అతడికి నచ్చింది. అయితే ఇంటి యజమాని గౌతమ్‌ను లింక్డ్ ఇన్ ఫ్రొఫైల్‌తో (LinkedIn profile) పాటు తన గురించి వివరిస్తూ ఓ షార్ట్ నోట్స్ కూడా రాసి పంపించమన్నాడు. అది విని గౌతమ్ షాకయ్యాడు. వాట్సాప్ ద్వారా జరిగిన తమ సంభాషణ మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఆ పోస్ట్ కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Viral Video: వామ్మో.. ఈ దొంగలు మామూలోళ్లు కాదుగా.. ఇంటికి ఒకటికి రెండు తాళాలు వేసినా సౌండ్ రాకుండా గేట్లు ఎలా తీశారో మీరే చూడండి..!

తక్కవ వ్యవధిలో గౌతమ్ పోస్ట్‌ను 1.5 లక్షల మంది వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. బెంగళూరులో నివసిస్తున్న చాలా మంది తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. ``బెంగళూరులో బతకాలంటే ముందు జాబ్ ఇంటర్వ్యూ పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత హౌస్ ఇంటర్వ్యూ పూర్తి చెయ్యాల``ని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. తనకూ అలాంటి అనుభవం ఎదురైందని, తనను ఓ ఇంటి యజమాని రెజ్యూమ్ పంపించమన్నాడని మరో వ్యక్తి తెలిపారు.

Bride: కాబోయే భర్త నోట ఊహించని కోరిక.. ఎంత చెప్పినా వినకపోవడంతో 22 ఏళ్ల ఆ యువతి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2023-03-21T10:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising