ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Thalapathy67: విక్రమ్ ని మించి విజయ్ సినిమా వుండబోతోంది

ABN, First Publish Date - 2023-01-31T18:32:14+05:30

దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వ్యూహాత్మకంగా విజయ్ తో చేస్తున్న (#Thalapathy67) సినిమాలో ఎవరిని తీసుకుంటున్నారు అన్న విషయాన్ని సాంఘీక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ తో పాటు, సంజయ్ దత్ (Sanjay Dutt), ప్రియా ఆనంద్ (Priya Anand), శాండీ, మిస్కిన్, అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) ఇలా ఇంతవరకు ప్రకటించిన వారిలో వున్నారు. ఇది చూస్తుంటే ఈ సినిమా 'విక్రమ్' కన్నా ఇంకా పెద్ద రేంజ్ లో వుండబోతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వ్యూహాత్మకంగా విజయ్ తో చేస్తున్న (#Thalapathy67) సినిమాలో ఎవరిని తీసుకుంటున్నారు అన్న విషయాన్ని సాంఘీక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ తో పాటు, సంజయ్ దత్ (Sanjay Dutt), ప్రియా ఆనంద్ (Priya Anand), శాండీ, మిస్కిన్, అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) ఇలా ఇంతవరకు ప్రకటించిన వారిలో వున్నారు. ఇది చూస్తుంటే ఈ సినిమా 'విక్రమ్' కన్నా ఇంకా పెద్ద రేంజ్ లో వుండబోతోంది

దక్షిణాదిలో రాజమౌళి (SS Rajamouli), ప్రశాంత్ నీల్ (Prashanth Neel), సుకుమార్ (Sukumar) లాంటి దిగ్గజాలు లాంటి దర్శకులు ఎంతో పేరు తెచ్చుకున్నా, అందరి చూపు మాత్రం ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) మీదే వుంది. ఎందుకంటే అతను ఇంతకు ముందు కమల్ హాసన్ (Kamal Haasan) తో 'విక్రమ్' (Vikram) అనే సూపర్ డూపర్ హిట్ సినిమా తీసే అందరిని మెప్పించాడు. ఆ 'విక్రమ్' సినిమా చూసి ప్రపంచ సినిమా ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఎంత బాగా తీసాడు, అందులోకి ఒక మల్టీ-స్టార్రర్ సినిమా అది, కమల్ హాసన్ (Kamal Haasan), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ ఫాజిల్ (Fahadh Fazil) ఇంకా చివర్లో సూర్య (Suriya) ఇంకో ప్రత్యేక ఆకర్షణ. ఇంతమంది పెద్ద పెద్ద నటుల్ని పెట్టుకొని సినిమా సంవత్సరాల తరబడి తీయలేదు అతను, తొందరగానే తీసేసాడు. ఆ సినిమా అన్ని భాషల్లోనూ పెద్ద విజయం సాధించటమే కాకుండా, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రపంచ ప్రేక్షకుల కళ్ళల్లో పడేట్టు చేసింది ఈ సినిమా విజయం.

ఇప్పుడు లోకేష్ కనగరాజ్, తలపతి విజయ్ తో చేతులు కలిపాడు. దీనికి తలపతి67 (#Thalapathy67) అని పేరు పేరు ఇందులో ఎవరు పని చేస్తారో వాళ్ళని సాంఘీక మాధ్యమాల్లో పరిచయం చేస్తున్నాడు (#Thalapathy67Cast). అది చూస్తుంటేనే ఈ సినిమా 'విక్రమ్' కన్నా పెద్ద రేంజ్ లో తీయాలని లోకేష్ అనుకుంటున్నగా తెలుస్తోంది. ముందు హిందీ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) ని, తరువాత ప్రియా ఆనంద్, ఆ తరువాత కొరియోగ్రాఫర్, నటుడు శాండీ, దర్శకుడు మిస్కిన్ (#Thalapathy67Update) ఇలా ఒక్కొక్కరిని ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్టు సాంఘీక మాధ్యమాల్లో ప్రకటించాడు. ఇది కూడా ఒక మంచి యాక్షన్ సినిమాగా రూపు దిద్దుకుంటోంది తెలిసింది. ఇది కూడా గూఢచారి నేపథ్యంలో ఉంటుందని తెలిసింది.

ఇందులో విజయ్ ఒక గూఢచారి గా, సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారని తెలిసింది. అనిరుద్ (Anirudh Ravichander) దీనికి సంగీతం సమకూరుస్తున్నారు, అది క్రేజీ అంటున్నారు. సాంఘీక మాధ్యమాల్లో ఈ విజయ్ సినిమా వైరల్ అవుతూనే వుంది. ఇప్ప్పుడు ఇది ఒక అనూహ్య కాంబినేషన్ అని నెటిజన్స్ అంటున్నారు. అదీ కాకుండా లోకేష్ ఇంతకు ముందు విజయ్ తో 'మాస్టర్' అనే సినిమా కూడా చేసాడు. ఇది రెండో సినిమా, ఈ సినిమా రేంజ్ ఏంటో ఇప్పుడే అర్థం అవుతోంది. ఇంకా ముందు ముందు ఎన్ని ఆశ్చర్యకర విషయాలు ప్రకటిస్తారో చూడాలి.

Updated Date - 2023-01-31T18:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising