ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saturn: ఢిల్లీలో అద్భుతం.. ఆకాశంలో కనిపించిన శని గ్రహం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2023-08-22T16:41:05+05:30

తాను ఢిల్లీ గగనతలంలో శని గ్రహం కదలికలను రికార్డు చేసినట్టు ``అనిమే-కుంగ్‌ఫు`` అనే రెడ్డిట్ వినియోగదారుడు పేర్కొన్నాడు. తన ఐఫోన్ 14 ప్రో ద్వారా శని గ్రహం కదలికలను చిత్రీకరించినట్లు తెలుపుతూ రెడ్డిట్ ద్వారా ఆ అద్భుతమైన వీడియోను పంచుకున్నాడు.

తాను ఢిల్లీ (Delhi) గగనతలంలో (Sky) శని గ్రహం (Saturn) కదలికలను రికార్డు చేసినట్టు ``అనిమే-కుంగ్‌ఫు`` అనే రెడ్డిట్ వినియోగదారుడు పేర్కొన్నాడు. తన ఐఫోన్ 14 ప్రో (Iphone 14 Pro) ద్వారా శని గ్రహం కదలికలను చిత్రీకరించినట్లు తెలుపుతూ రెడ్డిట్ ద్వారా ఆ అద్భుతమైన వీడియోను పంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో పసుపు రంగులో కనిపస్తున్న శని గ్రహం చుట్టూ వలయాలతో కదులుతోంది (Saturn visible in Delhi Sky).

``ఢిల్లీ గగన తలంలో శనిగ్రహం (టెలీస్కోప్ సహాయంతో). గత రాత్రి ఢిల్లీలో ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. కాబట్టి మేం ఆస్ట్రోఫొటోగ్రఫీ చేయాలని నిర్ణయించుకున్నాం. శనిగ్రహం వీడియో ఇదిగో. ఐఫోన్ 14 ప్రో సహాయంతో ఆ వీడియో చిత్రీకరించాం`` అంటూ వివరాలు పంచుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వీడియో అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.

Viral: పెళ్లికి గడ్డం తీయాలని తండ్రి.. వద్దని వధువు.. కాబోయే భార్య మాట విన్నందుకు ఎంత పని జరిగిందంటే..

``అద్భుతం. ఐఫోన్‌ను ఎలా వినియోగించాలో తెలిసిన అరుదైన వ్యక్తి మీరు``, ``వీడియో అద్భుతంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, ఈ నెల 27, 28 తేదీల్లో శనిగ్రహం భూమికి అతి చేరువలోకి వస్తుందని శాస్త్రవేత్తలు గతంలోనే వెల్లడించారు. కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో శాస్త్రీయతను ఎవరూ ధ్రువీకరించలేదు.

Updated Date - 2023-08-22T16:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising