Viral News: ఈ ఫొటోలో కనిపిస్తున్న మొక్కలు ఏంటో గుర్తు పట్టగలరా..? నెట్టింట పెద్ద చర్చే జరుగుతోందిగా..!
ABN, First Publish Date - 2023-06-27T19:31:03+05:30
కూరగాయలు కొనడానికి ఎప్పుడూ మార్కెట్‌కు వెళ్లని వారికి వాటి పేర్ల మీద కూడా పెద్దగా అవగాహన ఉండదు. ఇంట్లో వండినపుడు తినడం మినహా కాయగూరలు కాసే మొక్కలు ఎలా ఉంటాయో కూడా తెలిసి ఉండకపోవచ్చు.
కూరగాయలు (Vegetables) కొనడానికి ఎప్పుడూ మార్కెట్‌కు వెళ్లని వారికి వాటి పేర్ల మీద కూడా పెద్దగా అవగాహన ఉండదు. ఇంట్లో వండినపుడు తినడం మినహా కాయగూరలు కాసే మొక్కలు ఎలా ఉంటాయో కూడా తెలిసి ఉండకపోవచ్చు. అంతేకాదు.. చాలా మందికి తోటకూర, గోంగూర, బచ్చలికూర మధ్య తేడాలను కూడా గుర్తించలేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ ఫొటోలో ఆకు కూర మొక్క (Plant)ను గుర్తించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
Anoop Kotwal అనే ట్విటర్ యూజర్ ఆ ఫొటోను షేర్ చేశారు. ``అది ఏ మొక్కో చెప్పగలరా?`` అని ప్రశ్నించారు. ఆ మొక్కకు ఉన్న ఆకులు కాస్త వెరైటీగా పదునైన అంచులతో ఉన్నాయి. ఆ ట్వీట్‌కు స్పందనగా చాలా మంది ప్రయత్నించారు. చాలా మంది రకరకాల పేర్లు చెప్పారు. కొందరు దానిని గంజాయి మొక్క అన్నారు. అయితే ఇది అలాంటి మొక్క కాదని, దీంతో తయారు చేసిన వంటకం చాలా రుచిగా ఉంటుందని అనూప్ హింట్ ఇచ్చారు. చివరకు కొందరు దీని సరైన పేరును గుర్తించారు.
Low Cost AC: ఏం తెలివయ్యా బాబూ.. కూలర్‌కు పెట్టే ఖర్చుతోనే ఏకంగా ఏసీనే రెడీ చేసుకున్నాడు..!
ఈ మొక్కను కందలి (Kandali) లేదా బిచ్చు (Bicchu Booti) అంటారని కొందరు యూజర్లు చెప్పారు. ఆ ఆకులను దేశంలోని కొన్ని కొండ ప్రాంతాల వారు చాలా ఇష్టంగా తింటారని, ఆ వంటకం చాలా రుచిగా ఉంటుందని తెలిపారు. కందలి ఆకుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కామెంట్లు చేశారు.
Updated Date - 2023-06-27T19:31:03+05:30 IST