Low Cost AC: ఏం తెలివయ్యా బాబూ.. కూలర్‌కు పెట్టే ఖర్చుతోనే ఏకంగా ఏసీనే రెడీ చేసుకున్నాడు..!
ABN , First Publish Date - 2023-06-27T17:22:27+05:30 IST
పది రోజుల క్రితం వరకు దేశం మొత్తం ఉక్కపోతతో చికాకు పడింది. తీవ్రమైన ఎండల కారణంగా ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయింది. వేడికి తట్టుకోలేక ఎంతో మంది తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎండ వేడి నుంచి బయట పడేందుకు చాలా మంది ఏసీలను ఆశ్రయించారు.
పది రోజుల క్రితం వరకు దేశం మొత్తం ఉక్కపోతతో చికాకు పడింది. తీవ్రమైన ఎండల కారణంగా ఉష్ణోగ్రత (Heat Wave)విపరీతంగా పెరిగిపోయింది. వేడికి తట్టుకోలేక ఎంతో మంది తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎండ వేడి నుంచి బయట పడేందుకు చాలా మంది ఏసీ (Air Conditioner)లను ఆశ్రయించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫ్యాన్లు, కూలర్లతో సేద తీరారు. అయితే ఢిల్లీ (Delhi)కి చెందిన ఓ వ్యక్తి తన అద్భుతమైన తెలివితేటలతో తమ ఇంట్లో తక్కువ ఖర్చుతో ఏసీని ఏర్పాటు చేసుకున్నాడు. అతడి తెలివిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Sikhle India అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ కూలర్ (Air Cooler) ఏసీ లాగే చల్లటి గాలిని ఇస్తోందట. ఆ వ్యక్తి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ సహాయంతో కూలర్‌ను ఏసీలా ఎలా మార్చుకున్నాడో చూడవచ్చు. కూలర్‌కు ఉండే పెద్ద కూలింగ్ ప్యాడ్‌కు 6 ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను లోపలి వైపు అమర్చాడు. ఆ కూలింగ్ ప్యాడ్ పైకి నీరు వచ్చేలా పైప్ ఏర్పాటు చేశాడు. కింద నీటి కోసం ఓ తొట్టెను ఏర్పాటు చేశాడు. ఆ కూలింగ్ ప్యాడ్ నుంచి వచ్చే గాలి చల్లగా లోపలకి వస్తోంది (Jugaad Videos).
Cow Video: వరదలో కొట్టుకుపోతున్న లేగదూడ.. ఎవరూ కాపాడలేని పరిస్థితి.. ప్రాణాలతో ఎలా బయటపడిందంటే..
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. మూడు లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఆ టెక్నాలజీ ఇండియా నుంచి బయటకు వెళ్లకూడద``ని వీడియోలో ఓ వ్యక్తి పేర్కొన్నారు. అలాగే ఈ ట్రిక్ చాలా బాగుందని, తక్కువ ఖర్చుతో ఏసీ తయారవుతుందని ఒకరు కామెంట్ చేశారు. అలాగే ఈ టెక్నాలజీ వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని మరొకరు పేర్కొన్నారు.