ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SS.Rajamouli: ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందా

ABN, First Publish Date - 2023-01-20T14:47:47+05:30

‘ఆర్ఆర్ఆర్’ (RRR) కు ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందానని చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS.Rajamouli) అన్నారు. సినిమాను ఎంట్రీగా పంపిస్తే పురస్కారం వచ్చే ఛాన్స్ అధికంగా ఉండేదని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్ఆర్ఆర్’ (RRR) కు ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందానని చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS.Rajamouli) అన్నారు. సినిమాను ఎంట్రీగా పంపిస్తే పురస్కారం వచ్చే ఛాన్స్ అధికంగా ఉండేదని చెప్పారు. ‘‘ఆస్కార్ ఎంట్రీ రాకపోవడంతో నిరాశ చెందిన మాట వాస్తవమే. అయితే, గతం గురించే ఆలోచిస్తూ కూర్చొనే వ్యక్తులం మేం కాదు. జరిగేందో జరిగిపోయింది. మనం దానిని మర్చిపోయి ముందుకు సాగిపోవాలి. మరో చిత్రం ‘ద లాస్ట్ ఫిలిం షో’ (The Last Film Show)కు ఎంట్రీ రావడంతో నేను సంతోషించాను. విదేశీయులు సైతం ‘ఆర్ఆర్ఆర్’ ను ఎంట్రీగా పంపిస్తే ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. కానీ, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు నాకు తెలియదు. అందువల్ల దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు’’ అని రాజమౌళి పేర్కొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతరామరాజు, కొమరం భీమ్‌ల స్ఫూర్తితో ‘ఆర్ఆర్ఆర్’ ను రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కీలక పాత్రలు పోషించారు. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రూ.1200కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. గోల్డెన్ గ్లోబ్‌ను కూడా ఈ మూవీ సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇదే పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌‌లో స్థానం దక్కించుకుంది. నామినేషన్ దక్కించుకున్న చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు.

Updated Date - 2023-01-20T14:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising