Viral Video: వామ్మో.. ఇదెక్కడి అరాచకం.. బైక్‌ను లేపి రాకెట్ లాంఛింగ్.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
ABN, First Publish Date - 2023-11-15T20:32:23+05:30
దీపావళి పండుగను దేశమంతా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. చాలా మంది టపాసులు పేల్చి పండుగను జరుపుకున్నారు. అయితే కొందరు మాత్రం శృతి మించి ప్రవర్తించారు. వినూత్నంగా టపాసులు కాల్చడానికి ప్రయత్నించి ప్రమాదాలు కొని తెచ్చుకున్నారు.
దీపావళి (Diwali) పండుగను దేశమంతా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. చాలా మంది టపాసులు పేల్చి పండుగను జరుపుకున్నారు. అయితే కొందరు మాత్రం శృతి మించి ప్రవర్తించారు. వినూత్నంగా టపాసులు కాల్చడానికి ప్రయత్నించి ప్రమాదాలు కొని తెచ్చుకున్నారు. తమిళనాడు (Tamilnadu)లోని కొందరు యువకులు బైక్‌లతో డేంజరస్ స్టంట్లు (Bike Stunts) చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది. ఆ విన్యాసాలు చేసిన పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు (Crime News).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు యువకులు రోడ్డుపై బైక్‌లపై ప్రయాణిస్తూ వినూత్నంగా టపాసులు పేల్చారు. ఓ యువకుడు తన బైక్‌కు దీపావళి రాకెట్ క్యాట్రిడ్జ్‌ను బిగించి ఆ రాకెట్లు ఆకాశం వైపు దూసుకెళ్లేలా బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపాడు. అలాగే కొద్ది దూరం ముందుకు ప్రయాణించాడు. నిప్పులు చిమ్ముకుంటూ ఆ టపాసులు గాల్లోకి లేచాయి. యువకుడు ఆ స్టంట్ చేస్తుండగా, ఇతర యువకులు అతని మోటార్‌సైకిల్ చుట్టూ చేసి మరిన్ని ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు.
OMG: చేసేది కూరగాయల వ్యాపారం.. కేవలం 6 నెలల్లో ఏకంగా రూ.21 కోట్ల సంపాదన.. ఇతడి గురించి పోలీసులు ఆరా తీస్తే..!
ఆ వీడియో వైరల్ అయి పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు ఆ ఘటన తిరుచిరాపల్లిలో జరిగినట్టు గుర్తించారు. బైక్ నెంబర్ల ఆధారంగా ఆ విన్యాసాలు చేసిన 10 మందిని అరెస్ట్ చేశారు. వారిపై మోటారు వాహనాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Updated Date - 2023-11-15T20:32:25+05:30 IST