ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RBI: రూ.500 నోట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన...

ABN, First Publish Date - 2023-06-08T21:50:52+05:30

పెద్ద రూ.2000 నోట్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో రూ.500 నోట్లపై వెలుడుతున్న ఊహాగానాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రూ.500 నోట్లను సర్క్యూలేషన్ నుంచి ఉపసంహరించుకునే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: రూ.2000 నోట్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో రూ.500 నోట్లపై వెలుడుతున్న ఊహాగానాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రూ.500 నోట్లను సర్క్యూలేషన్ నుంచి ఉపసంహరించుకునే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. రూ.500 నోట్లను వెనక్కి తీసుకుని రూ.1000 నోట్లను పున:ప్రవేశపెట్టాలనే ఆలోచనేమీ లేదన్నారు. ఇలాంటి విషయాలపై వందతులను వ్యాపించ చేయవద్దని జనాలను ఆయన కోరారు. ఈ మేరకు ద్రవ్య విధాన కమిటీ పాలసీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.2000 ఉపసంహరణ నేపథ్యంలో ఊహాగానాలు వెలువడుతుండడంతో ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

కాగా మే 19న రూ.2 వేల నోట్ల రద్దును ఆర్బీఐ ప్రకటించింది. రూ. 2 వేలనోట్ల మార్పిడికి (2000 Notes Exchange) సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్(RBI Governor Shaktikanta Das) రూ. 2 వేల నోట్ల డిపాజిట్లపై కీలక ప్రకటన చేశారు. గడిచిన 20 రోజుల్లో రూ. 2 వేల నోట్ల డిపాజిట్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు. కేవలం మూడు వారాల్లోనే 50 శాతం నోట్లు డిపాజిట్ (Deposite) అయినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో 85శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చినట్లు శక్తికాంత దాస్ ప్రకటించారు. మార్చి 31 వరకు చలామణిలో ఉన్న రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. చివరి మూవ్‌మెంట్‌లో రద్దీని తగ్గించేందుకు ప్రజలు ముందుగానే రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు తగ్గట్టుగా సెంట్రల్ బ్యాంకు కరెన్సీ కలిగి ఉందని శక్తికాంత్ దాస్ తెలిపారు.

Updated Date - 2023-06-08T22:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising