ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking Video: జింక పిల్లను అమాంతం మింగేసిన కొండచిలువ.. స్థానికులు చూసి దాన్ని ఎలా బయటకు రప్పించారో చూస్తే..!

ABN, First Publish Date - 2023-10-30T19:34:32+05:30

అప్పుడే పుట్టిన ఓ జింక పిల్లను ఓ కొండ చిలువ అమాంతం మింగేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. జనాల చేతికి చిక్కాక పాము జింకపిల్లలను బయటకు కక్కేసిన తీరు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: కొండచిలువ..చాలా నెమ్మదిగా కదిలే ఈ పాము ఏ జంతువునైనా చుట్టుకుందీ అంటే ఇక అది ప్రాణాలు విడవాల్సిందే. కొండచిలువ పట్టునుంచి విడిపించుకోవడం దాదాపు అసాధ్యమే. అలాంటిది అప్పుడే పుట్టిన జంతువు దాని పాలపడితే ఇంకేమైనా ఉందా? ఈ ఆలోచనే దడపుట్టించేలా ఉంది కదూ! దురదృష్టవశాత్తూ సరిగ్గా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలోని పాము తీరుకు జనాలు వణికిపోతున్నారు.

Fight in Metro Train: అమ్మ బాబోయ్.. ఈ అమ్మాయి ఆవేశం మామూలుగా లేదుగా.. మెట్రో రైల్లో అందరూ చూస్తుండగానే..!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ కొండచిలువ అప్పుడే పుట్టిన ఓ జింక పిల్లను అమాంతం మింగేసింది. ఇక ఆ తరువాతే దాని తిప్పలు మొదలయ్యాయి. జింక చిన్నదే అయినా పాముకు మాత్రం కాస్తంత పెద్ద ఆకారమే. దీంతో, అంతపెద్ద జీవాన్ని మింగాక అది కదలలేక పడుకుండిపోయింది. అటుగా వెళుతున్న కొందరు గ్రామస్తులు దాన్ని చూసి షాకైపోయారు. దాని కడుపు పెద్దగా ఉండటం చూసి పెద్దజీవినే మింగి ఉంటుందని కంగారు పడ్డారు. ఆ తరువాత పాము సంరక్షకులను పిలిపించారు.

NRI News: ఫ్యామిలీతో సహా విదేశాల్లో సెటిల్ అవాలనుకుంటే.. తప్పక గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలివీ..!


అయితే, గ్రామస్థులు ఊహించినదే నిజమైంది. జంతు సంరక్షకులు చాలా నైపుణ్యంగా పాము కడుపులో ఉన్నది బయటకు కక్కేలా చేయగలిగారు. ఈ క్రమంలో దాని నోట్లోంచి ఓ పిల్ల జింక బయటకు వచ్చింది. పాము దాన్ని కొద్దికొద్దిగా బయటకు నెట్టుతున్న తీరు చూసి షాకైపోయారు. దీని బారిన మనుషులు పడ్డా చావుతప్పదంటూ అనేక మంది కామెంట్ చేశారు. ఈ వీడియోకు జనాల నుంచి విపరీతంగా రెస్పాన్స్ రావడంతో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

Updated Date - 2023-11-02T12:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising