ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pregnancy women: గర్భవతులు పొరపాటున కూడా ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడకండి.. పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే..

ABN, First Publish Date - 2023-04-17T20:58:21+05:30

చర్మాన్ని అందంగా, మృదువుగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడే కొన్ని క్రీములలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ను చాలా విరివిగా వాడతారు. బాడీ లోషన్(body lotion), మాశ్చరైజర్(moisturizer), సీరమ్(serum), సన్ స్క్రీన్(sun screen) ఇతర క్రీమ్ లు అమ్మాయిల లిస్ట్ లో ఉంటాయి. అయితే సాధారణ సమయాల్లో వాడినట్టు ప్రెగ్నెన్సీ సమయం(Pregnancy time)లో వీటిని వాడకూదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మాన్ని అందంగా, మృదువుగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడే కొన్ని క్రీములలో వినియోగించే రసాయనాలు గర్బంలో శిశువు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే ఎలాంటి ఉత్పత్తులను వాడకూడదు? ఎందుకు వాడకూడదు? తెలుసుకోవడం చాలా ముఖ్యం.

రెటినోయిడ్స్..(Retinoids)

ట్రెటినోయిన్, ఐసోట్రెటినోయిన్(tretinoin and isotretinoin) వంటి రెటినోయిడ్స్ ఆధారిత ఉత్పత్తులు మొటిమలు, ముడతలు , హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించగల శక్తివంతమైన పదార్థాలు. అయినప్పటికీ, అవి పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఈ పదార్థాల ఆధారంగా తయారయ్యే ఉత్పత్తులకు గర్బవతులు దూరంగా ఉంచాలి.

సోలిసిలిక్ యాసిడ్.. ( Salicylic acid)

బీటా-హైడ్రాక్సీ యాసిడ్(beta-hydroxy acid )ను సాలిసిలిక్ యాసిడ్ అని అంటారు. ఇది మొటిమలు తగ్గించడానికి, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. దీని ఆధారంగా తయారయ్యే ఉత్పత్తులు సహజంగా ఎలాంటి ప్రమాదం ఉండవని చాలామంది అంటారు. కానీ గర్భధారణ సమయంలో దీన్ని దూరంగా ఉంచడం మంచిదనేది వైద్యుల మాట. దీనిమోతాదు ఏమాత్రం ఎక్కువైనా పిల్లలకు పుట్టుకతో లోపాలు( birth defects) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

Viral Video: పిల్లలకోడి కోపాన్ని ఎప్పుడైనా చూశారా?? ఏకంగా డేగను ఎలా మూలన కూర్చోబెట్టిందో మీరే చూడండి..


హైడ్రోక్వినోన్.. (Hydroquinone)

హైడ్రోక్వినోన్(Hydroquinone) చర్మాన్ని కాంతివంతం చేసే ఏజెంట్( skin lightening agent), దీనిని సాధారణంగా హైపర్ పిగ్మెంటేషన్(hyper pigmentation) చికిత్సకు ఉపయోగిస్తారు. అయినప్పటికీ ఇది పిండంలో వైకల్యాలు కలగడానికి కారణం అవుతుంది. అందుకే గర్భధారణ సమయంలో హైడ్రోక్వినాన్ వాడకుండా ఉండటం మంచిది.

ఎసెన్షియల్ ఆయిల్స్..(Essential oils)

ఎసెన్షియల్ ఆయిల్స్ అరోమాథెరపీలోనూ(aromatherapy), స్కిన్‌కేర్ ఉత్పత్తు(skincare products)లలో సాధారణంగా ఉపయోగించే గాఢత కలిగిన నూనెలు. ఇవి చర్మానికి మంచి రిలాక్సినేషన్ ను ఇస్తాయి. అయినప్పటికీ వీటిలో ఉన్న గాఢత కారణంగా కడుపులో ఉన్న శిశువు మీద ప్రభావం పడుతుంది. మరీ ముఖ్యంగా టీ ట్రీ ఆయిల్, క్లారీ సేజ్ ఆయిల్( tea tree oil and clary sage oil) లు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. గర్భవతులు వీటిని వాడకూడదు.

సన్‌స్క్రీన్‌లు.. (sunscreens)

ఆక్సిబెంజోన్, ఆక్టినోక్సేట్(oxybenzone, octinoxate) వంటి రసాయనాల ఆధారంగా తయారైన సన్‌స్క్రీన్‌లు UV కిరణాలను గ్రహించి వాటిని వేడిగా మార్చడం ద్వారా చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి చర్మాన్ని రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేసినప్పటికీ చర్మం నుండి UV కిరణాలను రూపాంతరం చెందించే క్రమంలో శిశువు మీద ప్రభావం చూపిస్తాయి.

మొటిమల మందులు.. (acne medications)

మహిళలకు మొటిమలు పెద్ద సమస్య. వీటిని తగ్గించుకోవడానికి అక్యుటేన్ ఆధారిత మందులు వాడుతుంటారు. ఇవి పిల్లలు లోపంతో పుట్టేందుకు కారణం అవుతాయి.ఇలాంటి ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

అమ్మబాబోయ్.. పెళ్ళిలో స్వీట్లు బాలేవని ఈ పెళ్ళికొడుకు ఎంత ఘోరం చేశాడు.. పెళ్ళికూతురు తమ్ముడిని ఎత్తుకెళ్ళి ఏకంగా..


Updated Date - 2023-04-17T20:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising