ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sarath Babu passes away: శరత్ బాబు కన్నుమూతపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి.. ఆయన స్పందన ఇదే...

ABN, First Publish Date - 2023-05-22T20:27:44+05:30

దిగ్గజ నటుడు శరత్ బాబు తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) తెలిపారు. శరత్ బాబు గారితో నాకు చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల నుంచీ పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దిగ్గజ నటుడు శరత్ బాబు తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) తెలిపారు. ‘‘ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు కోలుకుంటారు అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శరత్ బాబు గారితో నాకు చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల నుంచీ పరిచయం ఉంది. నా మొదటి చిత్రం 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి'లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. 'వకీల్ సాబ్' చిత్రంలోనూ నటించారు.

తెలుగు చిత్రాల్లో ఆయన తనదైన నటనను చూపించారు’’ అంటూ పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. కాగా ఫిలిం ఛాంబర్‌లో శరత్ బాబు భౌతికకాయాన్ని ఉంచగా పలువురు సినీప్రముఖలు నివాళులు అర్పించారు. నటులు మురళిమోహన్, రఘుబాబు, మంచు విష్ణు, నరేశ్, పవిత్రతోపాలు పలువురు ఈ జాబితాలో ఉన్నారు.

పార్థీవదేహం చెన్నై తరలింపు..

ఫిలించాంబర్‌లో సందర్శన అనంతరం శరత్ బాబు మృతదేహాన్ని చెన్నై తరలిపించారు. రేపు చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా కొన్ని రోజులపాటు అనారోగ్యంతో బాధపడిన సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) (72) సోమవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరత్‌ బాబుని ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ పెరగడంతో కీలక అవయవాలైన ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ పాడైనట్లు వైద్యులు గమనించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఆయన మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

అసలు పేరు దీక్షితులు..

శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. శరత్ బాబు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని, ఆముదాలవలస. అతనికి తొమ్మిది మంది అన్నదమ్ములు. శరత్ బాబుకి అగ్ర నటులు అయిన శివాజీ గణేశన్ (Sivaji Ganeshan), కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), శరత్ కుమార్ (Sarath Kumar) ఫ్యామిలీలతో మంచి అనుబంధం ఉంది.

శరత్ బాబు 1973వ సంవత్సరంలో ‘రామ రాజ్యం’ అనే సినిమాతో పరిశ్రమలోకి ఆరంగేట్రం చేశారు. ఆయన సినిమా రంగ ప్రవేశం చేసిన కొన్నాళ్ల తరువాత తనకన్నా కొన్ని సంవత్సరాలు పెద్దది అయిన నటి రమాప్రభతో కొన్నేళ్లు కాపురం చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రమాప్రభని పెళ్లిచేసుకోలేదు అని వివరించారు. ఆ తర్వాత తమిళ నాడులో ప్రముఖ నటుడైన నంబియార్ కూతురు స్నేహలతని 1990లో వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 20 ఏళ్ళు కాపురం చేశాక, 2011 సంవత్సరంలో విడిపోయారు. 200కి పైగా సినిమాలలో నటించిన శరత్ బాబు.. ఇప్పటికీ అడపా దడపా సినిమాలలో కనిపిస్తూనే ఉన్నారు.

Updated Date - 2023-05-22T20:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising