ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Miracle baby: అద్భుతమంటే ఇదే.. అంత పెద్ద విలయం సంభవించినా..

ABN, First Publish Date - 2023-02-07T19:49:22+05:30

ఒక్కసారిగా విరుచుకుపడిన భూకంపాలతో అతలాకుతలమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరియా: ఒక్కసారిగా విరుచుకుపడిన భూకంపాలతో అతలాకుతలమైన తుర్కియే(Turkey), సిరియా(Syria)లలో ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలు కనబడుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూటీంలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య సిరియా(Syria)లో ఓ మిరాకిల్ బేబీ(Miracle Baby) జన్మించింది. శిథిలాలను తొలగిస్తుండగా కనిపించిన నవజాత శిశువు(Newborn)ను చూసిన సహాయక సిబ్బంది ఆశ్చర్యపోయి వెంటనే ఆ శిశువును చేతుల్లోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ చిన్నారి తల్లిదండ్రులను మాత్రం కాపాడలేకపోయారు.

భూకంపం సంభవించిన సమయంలో ఆ శిశువు తల్లి ప్రసవ వేదనకు గురైంది. అయితే, ఆ వెంటనే సంభవించిన ఘోర విపత్తు నుంచి తప్పించుకోలేకపోయింది. శిశువుకు జన్మనిచ్చి ఆమె కన్నుమూసింది. అదృష్టవశాత్తు ఆ శిశువు సహాయక సిబ్బంది కంట పడడంతో మృత్యువు నుంచి తప్పించుకుంది. చిన్నారిని పరిగెత్తుకుంటూ బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించిన వీడియో సోషల్ మీడియాకెక్కింది.

ఈశాన్య సిరియాలోని అఫ్రిన్ జిల్లా జెండెరెస్‌లో రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా ఈ ఘటన వెలుగు చూసింది. చీకటి, వర్షం, విపరీతమైన చలి ఆవరించి ఉన్న వేళ నవజాత శిశువు, ఆమె కుటుంబాన్ని రక్షించేందుకు సహాయక బృందాలు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. నవజాత శిశువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ ఘోర కలిలో ప్రాణాలు కోల్పోయారు. శిశువు మాత్రం ఈ దారుణ ప్రకృతి ప్రళయానికి సాక్షీభూతంగా నిలుస్తూ ఆసుపత్రిలో ఊపిరి పీల్చుకుంటోంది.

Updated Date - 2023-02-07T19:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising