ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dog birthday: పెంపుడు శునకానికి ఘనంగా బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియో చూస్తే వారెవా అనాల్సిందే!

ABN, First Publish Date - 2023-02-05T17:34:25+05:30

పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణం. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సందడిగా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు. ఆర్థిక స్థోమతను బర్త్‌డే సెలబ్రేషన్స్ ఆధారపడి ఉంటాయి. అయితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుషులు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణం. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సందడిగా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు. ఆర్థిక స్థోమతను బర్త్‌డే సెలబ్రేషన్స్ ఆధారపడి ఉంటాయి. ఎక్కువమంది తమ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు అత్యంత విశ్వాసపాత్రమైన పెంపుడు శునకం పుట్టినరోజు వేడుకలు జరిపి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇలాంటి ఘటనలు కొత్తమీ కాకపోయినప్పటికీ.. ఆసక్తికరమైన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా (West godavari dist) భీమవరానికి (Bhimavaram) చెందిన ప్రతాప్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, తాను నివాసముంటున్న ‘విశిష్ట’ అపార్ట్‌మెంట్‌లోని వాళ్లందరినీ పిలిచి మరీ ఘనంగా పార్టీ ఇచ్చాడు. ప్రతాప్ ఒక కుక్క పిల్లను ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ కుక్కపిల్లకు ‘సిద్దు’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ కుక్క పిల్ల రెండవ ఏడాదిలోకి అడుగుపెట్టగానే బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. అపార్ట్‌మెంట్‌లోని వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు. ముద్దుగా ఉండే ఆ కుక్క పిల్లలాంటి కేక్‌నే తయారు చేయించి కట్ చేశారు‌. కేకు ముక్కను కుక్కకు తినిపించారు. కుక్కపిల్ల సిద్దుతో ఫోటోలు దిగారు. వీడియోలు చిత్రీకించారు. అతిథులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్కకు ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై అక్కడి స్థానికులు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువుపై గొప్ప మమకారం ఉండబట్టే ఇలా చేశారంటూ చెప్పుకుంటున్నారు.

Updated Date - 2023-02-05T17:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising