ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Video: బాబోయ్.. చూస్తోంటేనే గుండెదడ వచ్చేస్తోందిగా.. పెంపుడు పాములైతేనేం.. పిల్లలతో ఇంత రిస్కేంటంటూ..!

ABN, First Publish Date - 2023-09-04T20:11:27+05:30

పాము అనే పేరు వింటేనే చాలు.. చాలా మంది భయంతో వణికిపోతారు. అవి ఉన్నాయని తెలిస్తే ఇక అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. చాలా కొద్ది మంది మాత్రమే పాములను పట్టుకోవడం, వాటితో ఆడుకోవడం చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ పాప తన మంచంపై పాములతో కలిసి నిద్రపోతోంది.

పాము (Snake) అనే పేరు వింటేనే చాలు.. చాలా మంది భయంతో వణికిపోతారు. అవి ఉన్నాయని తెలిస్తే ఇక అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. చాలా కొద్ది మంది మాత్రమే పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. పాములను పట్టుకోవడం, వాటితో ఆడుకోవడం చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ పాప తన మంచంపై పాములతో కలిసి నిద్రపోతోంది (Girl Naps With Snakes). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో (Snake Video) చాలా మంది నెటిజన్లకు ఆందోళన కలిగిస్తోంది.

snakemasterexotics అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆరియానా అనే బాలిక పాములతో కలిసి తన బెడ్‌పై నిద్రపోతోంది. ఆ బాలిక నిద్రపోతుండగా పక్కనే ఉన్న చాలా పాములు కదులుతున్నాయి. చూడడానికే ఆ వీడియో చాలా భయంకరంగా ఉంది. అవి పెంపుడు పాములని (Pet Snakes) తెలుస్తోంది. ఈ షాకింగ్ వీడియో ఇప్పటివరు 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. 78 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు.

Seema Haider: బాబూ.. కెమెరా ఆన్‌లోనే ఉంది..? పదే పదే హెచ్చరించిన యాంకర్.. సీమా హైదర్ జంటను లైవ్‌లోకి తీసుకుంటే..!

ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బాలిక తల్లిదండ్రులను విమర్శిస్తూ కామెంట్లు చేశారు. ``ఇది చాలా క్రూరత్వం``, ``ఆ బాలిక, పాములు కూడా ప్రమాదంలో ఉన్నాయి``, ``వ్యూస్ కోసం పాపను ప్రమాదంలో పెడతారా``, ``చాలా భయంకరంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-04T20:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising