ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kangana ranauth: నాపై నిఘా పెట్టారు.. అన్నీ లీక్‌ చేస్తున్నారు!

ABN, First Publish Date - 2023-02-06T13:56:42+05:30

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌(kangana ranaut) ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఘాటైన వ్యాఖ్యలతో (kangana comments)ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు క్వీన్‌. ఎవరో తనపై నిఘా పెట్టారంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు బీ టౌన్‌లో చర్చకు దారితీస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌(kangana ranaut) ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. ఘాటైన వ్యాఖ్యలతో (kangana comments)ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు క్వీన్‌. ఎవరో తనపై నిఘా పెట్టారంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు బీ టౌన్‌లో చర్చకు దారితీస్తున్నాయి. తన ప్రతి కదలికను ఎవరో గమనిస్తున్నారని, వ్యక్తిగత సమాచారాన్ని కూడా లీక్‌ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. వారిపై మండిపడ్డారు. ఈమేరకు ఇన్‌స్టా స్టోరీలో ఓ బాలీవుడ్‌ జంటను ఉద్దేశిస్తూ ఓ నోట్‌ పోస్ట్‌ చేశారు.

‘‘నేను ఇల్లు కదిలింది మొదలు.. (spying' on kangana) ఎక్కడికి వెళ్తున్నానో, ఎలా వెళ్తున్నానో తెలుసుకుంటున్నారు. రోడ్డుపైనే కాదు.. నా ఇంటి దగ్గర కూడా నాపై నిఘా పెట్టారు. నా కారు పార్కింగ్‌లో, నా మేడ మీద ఇలా ప్రతి చోట నన్ను గమనిస్తున్నారు. ఉదయాన్నే ఆరు గంటలకు బయటకు వెళ్తే అక్కడకూ వచ్చి వచ్చి ఫొటోలు తీస్తున్నారు. నా షూటింగ్‌, డైలీ షెడ్యూల్‌ తెలుసుకోగలుగుతున్నారు. నా వాట్సాప్‌ డేటా, వృత్తి పరమైన ఒప్పందాలు, పర్సనల్‌ లైఫ్‌ అన్ని వివరాలను లీక్‌ చేస్తున్నారని నమ్ముతున్నాను. ఆ హీరో తన బార్యను నిర్మాతగా మారాలని, నేను తీసినట్లు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు తీయాలని బలవంత పెడుతున్నాడు. నా దగ్గర పనిచేసిన సిబ్బంది మొత్తాన్ని వాళ్లు నియమించుకున్నారు. నన్ను ఒంటరిని చేసి, మానసికంగా ఒత్తిడికి గురిచెయ్యాలని చూస్తున్నారు. వాళ్లు నన్ను ఎంతగా ఫాలో అవుతున్నారంటే.. నా సోదరుడి పెళ్లికి వేసుకున్న వస్త్రధారణనే ఆమె పెళ్లికి వేసుకుంది’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కంగనా పెట్టిన ఇన్‌స్టా స్టోరీ బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే కంగనా చెప్పిన ఆ జంట రణ్‌బీర్‌- ఆలియాభట్‌ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం కంగనా ‘చంద్రముఖి’ సినిమా సీక్వెల్‌ ‘చంద్రముఖి 2’(Chandramkhi 2లో నటిస్తోంది. ఆమె కీలక పాత్రలో నటిస్తూ దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న ‘ఎమర్జెన్సీ’ (emergency) సినిమా షూటింగ్‌ పూర్తి చేశారు.

Updated Date - 2023-02-06T13:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising