ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Google క్రోమ్ వాడేవారికి హై రిస్క్ వార్నింగ్.. తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులట..!

ABN, First Publish Date - 2023-02-15T12:45:23+05:30

గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వం (Indian Government) తాజాగా హైరిస్క్ వార్నింగ్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వం (Indian Government) తాజాగా హైరిస్క్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ మీరు ఈ విషయాన్ని తేలిగ్గా తీకుంటే మాత్రం మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావడం ఖాయమని హెచ్చరించింది. పాత గూగుల్ క్రోమ్ వినియోగిస్తున్న వారి బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు చాలా సులువుగా దొంగిలిస్తున్నారని తెలిపింది. ఈ బ్రౌజర్‌లో పర్సనల్ సమాచారాన్ని హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేస్తు్న్నారని తెలియజేసింది. మనలో చాలా మంది వాడే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌. ఇంటర్నెట్‌ను ఉపయోగించేటప్పుడు మనకు సంబంధించిన చాలా సమాచారాన్ని ఇస్తుంటాం. ఒకవేళ మనం వాడే బ్రౌజర్ సురక్షితమైనది అయితే పర్లేదు. కానీ, సురక్షితం కాకుంటే మాత్రం మన సమాచారమంతా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. ఇలాంటి వాటిని అరికట్టేందుకే గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్లను అప్‌డేట్ చేస్తుంటుంది. అందుకే మనం వాడే బ్రౌజర్లను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఒకవేళ మనం పాత వర్షన్ బ్రౌజర్లను వాడుతుంటే మాత్రం ప్రమాదంలో పడినట్టే.

విండోస్ వినియోగదారులు 110.0.5481.77/.78 వర్షన్‌ను.. మ్యాక్ (Mac), లైనెక్స్ (Linux) యూజర్లు 110.0.5481.77 వర్షన్ కంటే పాతవి ఉపయోగిస్తున్నవారికి ఇండియన్ గవర్నమెంట్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో యూజర్ల సమాచారాన్ని హ్యాకర్లు ఎలా చోరీ చేస్తున్నారో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఓ నివేదిక విడుదల చేసింది. వీళ్ల బారిన పడకూదంటే గూగుల్ తెస్తున్న కొత్త వర్షన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. ఈ విషయంలో క్రోమ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని వార్న్ చేసింది.

ఇది కూడా చదవండి: కొత్త రూల్.. ప్రయాణీకులందరూ తప్పనిసరిగా ఆ వివరాలు వెల్లడించాల్సిందేనట..!

Updated Date - 2023-02-15T12:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising