ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వీళ్లందరూ వచ్చింది రేషన్ కోసం కాదు.. ఉద్యోగాల కోసం.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, Publish Date - Dec 16 , 2023 | 08:38 PM

మనదేశంలో నిరుద్యోగం అనేది ఎప్పట్నుంచో ప్రధాన సమస్యగా ఉంటోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ నిరుద్యోగం కారణంగా యువత నిరాశకు గురవుతోంది. ఒక్కో ఉద్యోగానికి వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

మనదేశంలో నిరుద్యోగం అనేది ఎప్పట్నుంచో ప్రధాన సమస్యగా ఉంటోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ నిరుద్యోగం కారణంగా యువత నిరాశకు గురవుతోంది. ఒక్కో ఉద్యోగానికి వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నిరుద్యోగం (Un employment) ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ కంపెనీ వాక్-ఇన్ ఇంటర్వ్యూకు (Walk-in Interview) ప్రకటన ఇచ్చింది. ఆ కంపెనీ ముందు వేలాది మంది యువతీయువకులు నిలబడి ఉండడం చాలా మందికి షాక్ ఇస్తోంది.

@freshercareers.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. హైదరాబాద్‌లోని ఒక సంస్థలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం వేలాది మంది యువతీ యువకులు తమ రెజ్యూమ్‌లు పట్టుకుని గేటు ముందు నిలబడి ఉన్నారు. గేట్ ఓపెన్ చేయగానే ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి వెళ్తున్నారు. అయితే సెక్యూరిటీ గార్డులు కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో తెలిపే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).

ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ మందికి పైగా వీక్షించారు. 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ``నిరుద్యోగం చాలా పీక్ స్టేజ్‌లో ఉంది``, ``ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు``, ``ఇలాంటి వీడియోలను రాజకీయ నాయకులకు పంపించాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Dec 16 , 2023 | 08:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising