Viral Video: పెళ్లిలో ఫొటో షూట్.. వరుడి పక్కనే కూర్చున్న ఇతడు సైలెంట్‌గా ఏం చేశాడో చూస్తే..
ABN, Publish Date - Dec 31 , 2023 | 07:45 PM
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు ట్రెండింగ్‌లోకి వచ్చే వీడియోలను చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తుంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు ట్రెండింగ్‌లోకి వచ్చే వీడియోలను చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తుంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. పెళ్లి సమయంలో వరుడికి అతడి స్నేహితుడు మస్కా కొట్టిన వీడియో ఇది. ఇది నిజమా ప్రాంక్ వీడియోనా అన్న విషయాన్ని పట్టించుకోకుండా కడుపుబ్బా నవ్వుకుంటున్న నెటిజన్లు వీడియోను తెగ వైరల్(Viral Video) చేస్తున్నారు.
Viral: ఉడతకు ఇన్ని తెలివితేటలా! టూరిస్ట్ కనిపించగానే అతడి వద్దకు వచ్చి ఏం చేసిందో చూస్తే..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వివాహం తరువాత వరుడు తన స్నేహితులతో కలిసి ఫొటోలు దిగాడు. వరుడు మధ్యలో కూర్చోగా ఇద్దరూ స్నేహితులు అతడికి ఇరువైపులా కూర్చున్నారు. ఇంతలో ఓ స్నేహితుడి చూపు వరుడి మెడలో కరెన్సీ దండపై పడింది. దీంతో, మెల్లగా చేయి చాచి ఓ నోటు నొక్కేసి జేబులో పెట్టుకున్నాడు. వరుడు మాత్రం ఇవేవీ గమనించలేదు. నోటు జేబులో పెట్టుకున్నాక వరుడి స్నేహితుడు యాథాప్రకారం ఫొటోలకు ఫోజులిచ్చాడు (Friend steals rs 500 note from Grooms currency garland).
Bihar: షాకింగ్.. పిల్లలు లేని మహిళల్ని తల్లుల్ని చేసే జాబ్ ఉందని చెప్పి మగాళ్లను..
నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియో జనాలను బాగా ఎంటర్‌టెయిన్ చేస్తోంది. వీడియో చూసి జనాలు పడీపడీ నవ్వుకుంటున్నారు. వీడియోకు వేలల్లో లైకులు, కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.
Viral: ఇది పొరపాటు అట..ఈ పైలట్ విమానాన్ని ఎక్కడ దింపేశాడో చూడండి! ప్రయాణికులకైతే భారీ షాక్!
Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?
Viral: ఈ కుర్రాడు స్విగ్గీకే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!
Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!
Updated Date - Dec 31 , 2023 | 07:52 PM